విశాఖ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌ల్దేరిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: శ్రీశారదా పీఠం వార్షిక మ‌హోత్స‌వాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖప‌ట్నం ప‌ర్య‌ట‌న‌కు బయల్దేరారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. అక్క‌డి నుంచి విశాఖ‌కు బ‌య‌ల్దేరి వెళ్లారు. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంత‌రం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శ్రీశారదా పీఠానికి వెళ్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి పీఠంలోని దేవతామూర్తులకు సీఎం వైయ‌స్ జగన్‌ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంత‌రం రాజశ్యామల యాగంలో పాల్గొంటారు. దాదాపు గంట పాటు పీఠంలో జరగనున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. 

Back to Top