క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

టీష‌ర్ట్‌ల‌పై స్టాంప్ వేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నెల్లూరు: రాష్ట్రంలో 175కి 175 అసెంబ్లీ స్ధానాలను గెలవాలన్న లక్ష్యంతో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ బ‌రిలో దిగింది. క్లీన్‌స్వీప్ సాధించే దిశగా.. నెల్లూరు జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ, 1 పార్లమెంట్‌ స్ధానాలు గెలవాలన్న టార్గెట్ తో నెల్లూరు జిల్లా చింతరెడ్డిపాలెం స్టే పాయింట్‌ వద్ద  8 బై 8 టీషర్ట్‌ మీద వైయ‌స్‌ఆర్‌సీపీ స్టాంప్‌ను ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి వేసి పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ ప‌రిచారు. కార్య‌క్ర‌మంలో రాజ్యసభసభ్యుడు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్ధి వి విజయసాయిరెడ్డి, పార్టీ నేత‌లు గుర్రంపాటి దేవేంద్రారెడ్డి, హర్ష, సిద్ధారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top