ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మీ ముందుకు వ‌చ్చా

నంద్యాల స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

పరిపాలన సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం

చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు

పేదరికం కారణంగా చదువులు ఆగిపోరాదు

పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో తల్లిదండ్రులకు తోడుగా నిలుస్తున్నాం

 పిల్లలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి చదువు
 
2021–22 విద్యా సంవత్సరానికి రెండో విడత జగనన్న వసతి దీవెన

10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ

నాడు–నేడుతో బడుల రూపురేఖలు మారుస్తున్నాం

పేదల పిల్లల కోసం నాన్నగారు వైయస్‌ఆర్‌ ఒక అడుగు ముందుకేస్తే.. నేను రెండు అడుగులు వేస్తున్నా..

ఎల్లో పార్టీ కడుపుమంట, అసూయకు మందే లేదు

ఇవి ఎక్కువైతే బిపి వస్తుంది.. ఏదో ఒకరోజు గుండెపోటు వస్తుంది

ప్రతిపక్షం పార్లమెంట్‌ వేదికగా రాష్ట్రం పరువు తీసింది

రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులు చంద్రబాబు, దత్తపుత్రుడు, ఎల్లో మీడియాకు కనిపించవు

రోజుకొక కట్టుకథ అల్లుతూ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు

నంద్యాల: ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా చేస్తానని ఇక్కడే చెప్పా….. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ..ఇవాళ మీ ముందుకు వ‌చ్చాన‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  పాలనా సంస్కరణలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామ‌న్నారు. పేదరికంతో ఏ ఒక్కరు విద్యకు దూరమయ్యే పరిస్థితి రాకూడదు. పాదయాత్రలో ఎన్నో గాథలు విన్నా…..విద్యారంగాన్ని పూర్తిగా మార్చేందుకు అడుగులు వేశాం. అరకొరగా కాకుండా పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ అమలు చేస్తున్నాం. భోజనం, వసతి ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన తెచ్చామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. ఇంట్లో ఎంత మంది చదివితే అంత మందికి ఇస్తాం. తల్లుల ఖాతాలోకి రెండు విడతలుగా ఇస్తామ‌న్నారు. జగనన్న వున్నాడని మీరు భరోసాతో వుండండి. అన్నీ నేను చూసుకుంటాను. ప్రతీ ఇంటి మేనమామగా పిల్లలను చదివించే బాధ్యత తనదని మరోసారి తల్లిదండ్రులకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భరోసా ఇచ్చారు. 2021-22 విద్యాసంవత్సరానికి గానూ రెండు విడత ‘జగనన్న వసతి దీవెన’లో భాగంగా నంద్యాల‌లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కి లబ్ధిదారులకు నగదు జమ చేశారు. నంద్యాల స‌భ‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట్లాడారు. ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..ఆయ‌న మాట‌ల్లోనే..

 

 • ఇక్కడే ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేస్తానని, పరిపాలనను ప్రజలకు మరింత చేరువుగా చేర్చుతానని మొట్ట మొదట నంద్యాలలోనే మాట ఇచ్చాను. ఈ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ..ఇక్కడేకే మీ బిడ్డ‌గా మీముందుకు వచ్చానని సగర్వంగా మీకు చెబుతున్నాను.
 • ప్రతి ఒక్కరికి మీ బిడ్డ ఈ రోజు రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను.
 • పరిపాలనను ప్రజల వద్దకు తీసుకెళ్లి సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు పిల్లల చదువులకు సంబంధించి అనేక సంస్కరణలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఎన్నెన్నో అడుగులు ముందుకు వేశాం. ఈ రోజు మీ అందరికీ కూడా విద్యారంగంలో జరుగుతున్న సంస్కరణలు, పరిణామాలు గమనించమని కోరుతున్నా.
 • ఏ ఒక్క పాప గాని, ఏ ఒక్క బా బు గాని ప్రాథమిక, ఉన్నత విధ్యకు దూరం అయ్యే పరిస్థితి రాకూడదు. ఏ ఒక్క తల్లిదండ్రి అప్పుల పాలు కాకూడదు. ఇది ఒక గొప్ప ఆలోచన. నా పాదయాత్రలో..నా కళ్లేదుటే ఎన్నో గాధలు విన్నా..
 • చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. ఈ చదువు అనే అస్తి పిల్లలకు ఇవ్వలేకపోతే పేదరికం నుంచి ఆ కుటుంబాలు బయటకురావు. సమూలంగా విద్యారంగాన్ని మార్చే దిశగా అడుగులు వేశాం.
 • పేద విద్యార్థులకు అయ్యే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చి ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు తోడుగా నిలిచాం. గతంలో మాదిరిగా కాకూండా పూర్తి ఫీజు రీయింబ్స్‌మెంట్‌ ఇచ్చి ఆదుకున్నాం.
 • మరోవైపు భోజనం వసతి ఖర్చులకు తల్లిదండ్రులు, పిల్లలకు ఇబ్బంది పడకూడదు. వేలల్లో ఉన్న ఖర్చులకు ఇబ్బందులు పడకూడదన్న పరిస్థితి రాకూడదు. నాన్నగారు దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని చూశాం. ఆయన చనిపోయిన తరువాత పాలకులు నీరుగార్చారు. నాన్నగారు పేద పిల్లల చదువుల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే..అదే నాన్నకు కొడుకుగా జగన్‌ అనే నేను.. రెండు అడుగులు ముందుకు వేస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి పూర్వ వైభవం తీసుకువస్తూ..కొన్ని మార్పులు కూడా చేశాం. జగనన్న వసతి దీవెన పథకాన్ని తీసుకువచ్చాం. 
 •  ఈ రోజు నంద్యాల గడ్డ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 10,68,150 మంది పిల్లలకు మంచి జరిగేలా 9,61,140 తల్లుల ఖాతాల్లోకి నేరుగా  బటన్‌ నొక్కి రూ.2021–2022 ఏడాదికి రెండో విడతగా రూ.1024 కోట్లు జమ చేస్తున్నాన‌ని సగర్వంగా చెబుతున్నా.
 • జగనన్న వసతి దీవెనల కింద కాలేజీలకు వెళ్లి ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు రూ.20 వేలు ఆ తల్లుల ఖాతాల్లోకి జగనన్న వసతి దీవెన ద్వారా ప్రతి ఏటా రెండో దఫాల్లో ఈ సొమ్ము ఇస్తున్నాం. ఈ రోజు రెండో  విడతగా రూ.1024 కోట్లు ఇస్తున్నాం.
 • ఒక కుటుంబంలో ఒకరికే పరిమితం చేసే రోజులు పోయాయి. ఒక కుటుంబంలో  ఎంత మందిని చదివించినా గాని ఫర్వాలేదు. మీరు మీ పిల్లలను చదివించండి. ఎంతమందిని చదివించినా కూడా మీ అన్న జగన్‌ తోడుగా ఉంటానని ప్రతి చెల్లెమ్మకు చెబుతున్నా. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు. చదువుతోనే మన తల రాతలు మారుతాయి.
 • ఈ రోజు వసతి దీవెన కింద ఇచ్చే ఈ డబ్బులు ఈ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం. దీని వల్ల కాలేజీల్లో జవాబుదారితనం వస్తుంది. తల్లులు వెళ్లి ఫీజులు కట్టినప్పుడు ఆ కాలేజీల్లో ఉన్న వసతులపై విచారణ చేస్తారు. కాలేజీల్లో వసతులు లేకపోతే ఆ తల్లులు ప్రశ్నించవచ్చు. ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఆ కాలేజీలపై చర్యలు తీసుకుంటాం. 
 • తల్లులకు నేరుగా డబ్బులు ఇవ్వడం వల్ల వారికి ప్రశ్నించే హక్కు వస్తుంది. కచ్చితంగా కాలేజీలు జవాబుదారితనంతో వ్యవహరిస్తాయి. మెరుగైన వసతులు వస్తాయి.
 • చదువుల పరంగా మనం ఎన్ని మార్పులు చేశామో కూడా ఒక్కసారి ఈమూడేళ్లను గమనించాలి. రాష్ట్రంలో ఎంత పేద కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆ ప్రతి తల్లి, పాప, బాబు కూడా ఈ రోజు చదువులు చదవాలి. మెరుగైన చదువులు చదవాలన్న తపనతో విద్యారంగంలో మార్పులకు శ్రీకారం చుట్టాం.
 • చిన్న పిల్లలు చదివే స్కూళ్ల రూపురేఖలు మారాయి. ఆ పిల్లలకు మంచి ఆహారం అందిస్తున్నాం. ఏమి తింటే ఆ పిల్లలు బాగుంటారు. ఏం తింటే వారికి బోరు కొట్టకుండా ప్రతి రోజు ఒక రకంగా మెనూ ఉండేలా ఆలోచన చేశాను. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి ఆలోచన చేసి ఉండరు. ఆ పిల్లలు తినే భోజనానికి గోరుముద్ద పేరుతో మంచి భోజనం అందిస్తున్నానని సగర్వంగా చెబుతున్నా.
 • ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మార్చేశాం. బడుల్లో నాడు–నేడు కార్యక్రమంతో రూపురేఖలు మారుతున్నాయి. గతంలో బాత్‌రూమ్‌లకు వెళ్తే నీరు ఉండదు, స్కూళ్లలో బ్లాక్‌ బోర్డులు ఉండవు, ఫర్నిచర్‌ ఉండదు. వంటగదులు కూడా ఉండవు, పెయింటింగ్‌ ఉండేది కాదు. శిథిలావస్థలో స్కూళ్లు ఉండేవి. పూర్తిగా రూపురేఖలు మార్చుతున్నాం.
 • ఈ రోజు బైలివింగ్‌ టెస్ట్‌బుక్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చాం.  స్కూళ్లు అన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్‌ మీడియం చేస్తూ అడుగులు ముందుకు వేశాం. ప్రభుత్వ బడికి మళ్లీ మంచి రోజులు తీసుకురావడం జరిగింది.
 • విద్యావిధానాన్ని రాబోయే తరం అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి పది సంవత్సరాల తరువాత , 15, 20 సంవత్సరాల తరువాత మన పిల్లలు ఆ ప్రపంచంలో మన పిల్లలు పోటీపడి నెగ్గేలా ఈ రోజు పూర్తిగా విద్యారంగం రూపురేఖలు మార్చుతున్నాం. స్కూళ్ల నుంచి కాలేజీ వరకు రూపురేఖలు మార్చుతునానం.
 • కొత్తగా ఈ రోజు మన రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు వస్తున్నాయి. స్వాతంత్రం తరువాత మనకు 11 కాలేజీలు మాత్రమే ఉండేవి. నంద్యాల పట్టణంలో కొత్త మెడికల్‌ కాలేజీ కూడా వస్తుంది. స్కీల్‌ డెవలప్‌మెంట్‌కాలేజీ కూడా వస్తోంది. మైక్రోసాప్ట్‌ సర్టిఫికెట్‌ కూడా కాలేజీలకు అనుసంధానం చేశాం. జాబ్‌ ఓరియేంటేడ్‌గా మార్చుతున్నాం.
 • కాలేజీల్లో చదువుతున్న కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ విధానం తీసుకువస్తున్నాం. స్పెషలైజేషన్‌ కోర్సులు, 65 ఒకేషనల్‌ కోర్సులు ప్రవేశపెడుతున్నాం. డిగ్రీలో నాలుగేళ్ల ఆనర్స్‌ కోర్సులు తీసుకువస్తున్నాం.
 • రాష్ట్రంలో ఏ తల్లి అయినా కూడా తన పిల్లలకు మంచి చదువులు చదివించాలని ఆరాటపడుతోంది. ఆ తల్లులకు పేదరికం అడ్డురాకూడదు. వారిని ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడ జరగని విధంగా పిల్లలను బడికి పంపించే 1 నుంచి 12వ తరగతి వరకు ఆ తల్లులకు మంచి చేస్తూ జగనన్న అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాం. అటెండెన్స్‌కు జత కడుతూ ప్రతి ఏటా రూ.15 వేలు చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తున్నాం.
 • ఈ రోజు అక్షరాల 44 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుంది. నిజంగా దేవుడు ఇంతగా వారికి మేలు చేసేందుకు అవకాశం ఇవ్వడం ఇంతకన్న మరొక సంతోషం ఉండదు.
 • ఈ రోజు నా అక్కచెల్లెమ్మల కోసం   ఒక్క అమ్మ ఒడి మాత్రమే కాదు.వారికి తోడుగా ఉండేందుకు వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత, 31 లక్షల ఇళ్ల పట్టాలు , సున్నా వడ్డీ రుణాలు, ఆర్థిక సాధికారత కోసం కార్పొరేట్‌ సంస్థలతో ఈ రోజు ఒప్పందాలు చేసి బ్యాంకులతో టైఅప్‌లు ఇచ్చాం. ఇలా అనేక అడుగులు ముందుకు వేశాం. అక్కచెల్లెమ్మలు బాగుంటే పిల్లలు బాగుంటారనే నమ్మకం, విశ్వాసంతో మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెబుతూ సగర్వంగా అడుగులు ముందుకు వేశాం.
 • ఈ రోజు పిల్లల చదువుల మీద ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో గమనిస్తే..పిల్లలను వారి చదువులే కాకుండా, వారి శారీరక, మానసిక ఎదుగుదల కోసం వారి ఆహారం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకున్నాను. తల్లితో పాటు వారి గర్భంలో ఉన్న శిశువులకు కూడా మంచి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అనే గొప్ప కార్యక్రమం తీసుకువచ్చాం. ఆరు నెలల నుంచి 6 ఏళ్ల పిల్లల ఎదుగుదల కోసం వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ తీసుకువచ్చాం. ఈ పథకానికి గతంలో రూ.600 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాం.
 • వైయస్‌ఆర్‌ గోరుముద్ద అనే పథకానికి శ్రీకారం చుట్టాం. గతంలో ఈ పథకానికి ఏడాదికి రూ.500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఈ రోజు ఈ పథకానికి రూ.1900 కోట్లు అక్షరాల ఖర్చు చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నా.
 • పిల్లలకు మంచి జరగాలని చెప్పి ఈ పథకాన్ని తీసుకురావడమే కాకుండా పౌష్టికాహారం కూడా ఇస్తున్నాం. ఈ రోజు ఆశ్చర్యం ఏంటంటే ఈ చిక్కి పిల్లలు తినేటప్పుడు పాకం చేతులకు అంటుతోంది. ఆ చిక్కికి మంచి కవర్‌ తొడిగి..ఆ చిక్కిలో ఎన్ని గ్రాములు ఉండాలో జాగ్రత్తలు తీసుకుంటుంటే..చంద్రబాబు, ఆయనకు సంబంధించిన ఎల్లోమీడియా ఆ చిక్కి గురించి రాయరు. గతంలో రూ.500 మాత్రమే ఖర్చు చేశామని రాయరు. వైయస్‌ జగన్‌ రూ.1900 కోట్లు ఖర్చు అని చెప్పరు. కానీ చిక్కి కవర్‌ మీద వైయస్‌ జగన్‌ ఫొటో ఉందని రాస్తున్నారు. వీరి కడుపు మంట, అసూయకు మందే లేదు. ఈ కడుపు మంట, అసూయ ఎక్కువైతే కచ్చితంగా వీరికి బీపీ వస్తుంది. కచ్చితంగా ఏదో ఒక రోజు గుండెపోటు వచ్చి టికెట్‌ కొంటారు. కాబట్టి వీరు అసూయను తగ్గించుకుంటే వారి ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నా..
 •   
 • గత ప్రభుత్వం హయాంలో తక్కువగా ఉన్నజీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను కోరారు సీఎం వైయ‌స్ జగన్‌. 
 • చేస్తున్న మంచేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, యెల్లో మీడియాకు పట్టట్లేదని, పార్లమెంట్‌ వేదికగా చేసుకుని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు జేసేందుకు ప్రయత్నిస్తున్న గొప్ప ఘనత వాళ్లదన్నారు. 
 • ఎక్కడైనా ప్రతిపక్షాలు అనేవి రాష్ట్రం పరువు కోసం ఆరాటపడతాయని.. కానీ, మన రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యమైన ఏంటంటే.. ఇలాంటి ప్రతిపక్ష నేత.. ఆయన దత్త పుత్రుడు, యెల్లో మీడియాలు ఉండటం.. పరువు తీయడం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇవేవీ తనను బెదిరించలేవని, ప్రజల దీవెనలతో ‘జగన్‌ అనే నేను’ ఈ స్థానంలోకి వచ్చానని గుర్తు చేశారాయన. దేవుడి దయతో మరింత మంచి చేసే అవకాశం కలగాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయ‌స్‌ జగన్ త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.
 •  

తాజా వీడియోలు

Back to Top