అవ‌న్నీ చంద్ర‌బాబు బ్రాండ్లే

అసెంబ్లీ సాక్షిగా ఎల్లోమీడియా దుష్ప్రచారాన్ని ఎండగట్టిన సీఎం వైయస్‌ జగన్‌

జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ద్వారా నాటుసారాను నియంత్రించాం

నవరత్నాలు మా బ్రాండ్స్‌ 

అసెంబ్లీ సాక్షిగా టీడీపీ కుట్ర బట్టబయలు

అమ‌రావ‌తి:  చంద్రబాబు ప్రభుత్వమే ఎన్నో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందని సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్లు ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, బూమ్‌బూమ్‌ బీర్‌ అని ఎద్దేవా చేశారు. పవర్‌స్టార్‌ 999 బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే అని అన్నారు. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే అని తెలిపారు. ఈ బ్రాండ్లను మేం క్రియేట్‌ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న లిక్కర్‌ బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనివేనని అన్నారు. మా బ్రాండ్లు జగనన్న అమ్మఒడి, వైఎస్సార్‌ చేయూత, జగనన్న కాలనీలు అని తెలిపారు. నవరత్నాలు మా బ్రాండ్స్‌ అయితే ప్రెసిడెంట్‌ మెడల్‌, గవర్నర్‌ ఛాయిస్‌, బూమ్‌బూమ్‌ బీర్‌, పవర్‌స్టార్‌ 999 బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలేనని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. చంద్రబాబు, టీడీపీ, ఎల్లోమీడియా ఈ మూడు కూడా ఏపీలో ఛీప్‌ బ్రాండ్స్, ఛీప్‌ ఫెలోస్‌. వీరుమాత్రం ఏపీలో అప్పుడప్పుడు అందుబాటులో ఉంటారు. కానీ వీరి వక్రీకరణలు, విష ప్రచారం మాత్రం ఎల్లప్పుడు, ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. వీళ్ల బ్రాండ్ల నుంచి వచ్చే ప్రాడక్ట్స్‌ నిత్యం అందుబాటులోనే ఉంటాయి. జంగారెడ్డి గూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ సాక్షిగా టీడీపీ కుట్రను సీఎం వైయస్‌ జగన్‌ బట్టబయలు చేశారు. ఎల్లోమీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. 

మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదు 
కోటీ 16 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సీఎం జగన్‌ తెలిపారు. దిశ పేరు చెబితే మహిళతకు రక్షణ అని గుర్తుకొస్తుందని తెలిపారు. అమ్మఒడి పథకం ద్వారా రూ. 13,023 కోట్లు అందించామని చెప్పారు. వైఎస్సార్‌ చేయూత ద్వారా 9,082 కోట్లు అందించామని పేర్కొన్నారు. ఈబీసీ నేస్తం కింద రూ. 589 కోట్లు  అందించామని చెప్పారు. మహిళ పక్షపాతి ప్రభుత్వంగా పలు నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. మహిళల సొంతింటి కల నెరవేర్చామని తెలిపారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ఇస్తోందన్నారు. మహిళలకు మంచి చేసే మనసు చంద్రబాబుకు లేదని అన్నారు. గత ప్రభుత్వం ఎన్నో మద్యం బ్రాండ్లకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.

ఆ డిస్టిల‌రీస్ ఎవ‌రివి?
విశాఖ డిస్టిలరీస్‌ ఎవరిది? అయ్యన్న పాత్రుడిది కాదా?. పీఎంకే డిస్టిలరీస్‌ యనమల వియ్యంకుడిది కాదా?. స్పెషల్‌ స్టేటస్,త్రీ కాపిటల్స్‌ అంటూ ఫేక్‌ లేబుల్స్‌తో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. శ్రీకృష్ణ డిస్టిలరీస్‌ ఆదికేశవులనాయుడిది కాదా?

మనం అధికారంలోకి వచ్చాక 43 వేల బెల్ట్‌ షాపులు తొలగించడమే కాకుండా 4380 వైన్‌షాపుల పర్మిట్‌రూమ్‌లను రద్దు చేశాం. 2934 షాపులకు తగ్గించాం. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో మద్యం షాపులు ఉంటే విచ్చలవిడిగా రేట్లు పెంచుతారు. బెల్ట్‌షాపుల రద్దు కుదరదనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్యం షాపులు తీసుకుంటే బాగుంటుందని భావించింది. దీనివల్ల నిర్ణిత సమయంలో మాత్రమే మద్యం అమ్మకాలు చేపడుతోంది. గతంలో మద్యంషాపులు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉండటంతో నిత్యం మందు దొరికేది. ఎక్కడపడితే అక్కడ బెల్ట్‌షాపులు ఉండేవి. మన ప్ర‌భుత్వం వ‌చ్చాక ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటలకు మద్యంషాపులు బంద్‌ చేయించాం. మద్యాన్ని తగ్గించాలనే తపన, తాపత్రయంతోనే ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. ఆ తరువాత రేట్లు తగ్గించి నియంత్రణతో మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాం. నాటుసారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వేశాం. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో దాడులు చేయిస్తున్నాం.ఈ రెండున్నరేళ్లలో అక్షరాల 14. 32 లక్షల సారా నిల్వలు స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశాం.

సారా మా హయాంలోనే కొత్తగా పుట్టుకొచ్చినట్లు ఎల్లోమీడియా బిల్డప్‌ ఇస్తోంది. టీడీపీ హయాంలో కొద్దో గొప్ప చేశారన్నారు. ఐదేళ్ల వారి పాలనలో 1.42 లక్షల కేసులు టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నరేళ్లలో 1.09,983 కేసులు నమోదు చేశాం. ఐదేళ్లలో చంద్రబాబు నమోదు చేసిన కేసులకు డబుల్‌ అవుతుంది. 
గతంలో బాబు హయాంలో లక్ష 42 వేల కేసులు పెట్టారంటే నాటుసారా ఉన్నట్లా? లేన్నట్లా? 2016లో నవోదయం అనే పేరు పెట్టి ఒక క్యాంపెయిన్‌ నడిపారు. 254 బ్రాండ్లు, ఐదేళ్లలో 7 డిస్టరీలకు అనుమతులు ఇచ్చారు.  సమస్య అన్నది నాటుసారాది కాదు. నాటు నారాది. కల్తీ అయినా, విషం అన్నది వీరి మనస్సుల్లోనే ఉంది. అధికారం లేదన్న కడుపు మంటతో మనం అక్కచెల్లెమ్మల కోసం అమలు చేస్తున్న పథకాలతో సంతోషంగా ఉన్నారన్న పరిస్థితిని చూడలేక కడుపు మంట వీరిలో కనిపిస్తోంది. వీరి కడుపు ఇంకా మండాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకం దేవుడి  దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో ఇంకా మరింత మెరుగ్గా చేయాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నాను.

తాజా వీడియోలు

Back to Top