ప్ర‌తీ అక్క‌కు, చెల్లెమ్మ‌కు మేలు చేయాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయ‌స్ఆర్ చేయూత‌ను ప్రారంభించ‌డం అదృష్టంగా భావిస్తున్నా

నేరుగా మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాల్లోకి రూ.18,750
నాలుగేళ్ల‌లో రూ.75 వేలు ఆర్థిక సాయం అందుతుంది 

ఈ ప‌థ‌కంలో వ‌చ్చిన డ‌బ్బులు ఎలా ఉపయోగించుకోవాలో పూర్తి స్వేచ్ఛ ఆ మ‌హిళ‌కే 

గ‌తంలో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల‌లోపు మ‌హిళ‌ల‌కు ఏ ప‌థ‌కం లేదు

ఔత్సాహిక వ్యాపార‌స్తులుగా మ‌హిళ‌ల‌కు అవ‌కాశం

వివిధ కంపెనీలు, బ్యాంకుల‌తో ప్ర‌భుత్వం అవ‌గాహ‌న ఒప్పందం

జాబితాలో పేరు లేక‌పోతే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు

తాడేప‌ల్లి:  రాష్ట్రంలోని ప్ర‌తి అక్క‌కు, చెల్లెమ్మ‌కు మేలు చేయాల‌న్న‌దే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల‌లోపు మ‌హిళ‌లు వారి కాళ్ల‌పై నిల‌బ‌డేలా ఏదో ఒక్క‌టి చేయాల‌ని పాద‌యాత్ర‌లో ఆలోచ‌న చేశాన‌ని, పింఛ‌న్ ఇస్తామంటే వెట‌కారం చేశార‌ని, పింఛ‌న్ కంటే ఎక్కువ‌గా  ఇచ్చి ఆదుకోవాల‌నే ఉద్దేశంతో వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మానికి నాంది ప‌లికామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా మ‌హిళ‌ల‌కు మేలు జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ప్ర‌భుత్వం మ‌రో అడుగు ముందుకు వేసి, మ‌హిళ‌ల‌కు ఔత్సాహిక వ్యాపారస్తులుగా చేసేందుకు పెద్ద పెద్ద కంపెనీల‌తో అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్న‌ట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. మ‌హిళ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హించారు.

నాకు బాగా గుర్తుంది..

ముందుగా ప్ర‌తి అక్క‌కు, చెల్లెమ్మ‌కు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. ఆగ‌స్టు 12న చేయూత కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం దేవుడి ద‌య‌, మీఅంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌లే ..ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు బాగా గుర్తు ఉంది. ఆ రోజు పాద‌యాత్ర‌లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు ఏదైన చేయాలంటే ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో ఏది కూడా ఈ ప్యాకేజీలో లేవు. వాస్త‌వంగా చెప్పాలంటే ఏ ప‌థ‌కం కూడా ప్ర‌భుత్వానికి సంబంధించి ఏది లేదు. రెండోవ‌ది ఈ వ‌య‌సులో ఉన్న అక్క‌లు కుటుంబాన్ని పూర్తిగా న‌డిపించ‌గ‌లిగే  రెస్పాన్స్‌బుల్ వ‌య‌సులో ఉన్న‌వారు. వీరికి ఏదైనా జ‌రిగితే కుటుంబానికి అంతా కూడా మంచి జ‌రుగుతుంది. వీళ్లంద‌రికీ కూడా మంచి జ‌ర‌గాల‌ని, గ‌తంలో అయితే కార్పొరేష‌న్ల పేరుతో లోన్లు ఇచ్చేవారు. ఊర్లో వెయ్యి మంది ఉంటే ఒక‌రో, ఇద్ద‌రికి లోన్లు వ‌చ్చేవి. రాజ‌కీయ ప‌లుకుబ‌డి, లంచం ఇస్తే త‌ప్ప ఏ గ్రాంట్ , ఏ లోన్ రాని ప‌రిస్థితి గ‌తంలో ప్ర‌స్తుటంగా క‌నిపించేది. దీని వ‌ల్ల ఎవ‌రికి మేలు జ‌రిగేది కాదు. వీటిని మార్పు చేసి, ప్ర‌క్షాళ‌న దిశ‌గా  అడుగులు వేస్తున్నాం.

ఈ వ్య‌వ‌స్థ‌ల‌ను మార్పు చేయాల‌నే ఉద్దేశంతో ..ఈ వ‌య‌సులో ఉన్న అక్క‌ల‌కు సంపూర్ణంగా అండ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో పెన్ష‌న్ రూపంలో ఇద్దామ‌నుకున్నాం. ఆ రోజుల్లో పెన్ష‌న్ రూ.1000 ఉండేది. 45 ఏళ్ల‌కే పింఛ‌న్ ఏంట‌ని జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని పూర్తిగా వెట‌కారం చేయ‌డం మొద‌లుపెట్టారు. వెట‌కారం చేస్తున్నార‌ని పింఛ‌న్ వ‌ద్దులే..వేరే ర‌కంగా సాయం చేద్దామ‌ని ఆలోచ‌న చేశాను. రూ.1200 కాదు..రూ.18,750 ఇస్తాం. నాలుగేళ్లు వ‌రుస‌గా అదే అక్క చెల్లెమ్మ‌ల‌కు రూ.18,750 చొప్పున రూ.75,000 వేలు ఇస్తే ఆ డ‌బ్బుతో త‌న జీవితాన్ని మార్పు చేసుకునే అవ‌కాశం వ‌స్తుంద‌ని ఆ రోజు పాద‌యాత్ర‌లో శ్రీ‌కారం చుట్టాం. దాన్ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో చేర్చాం. అధికారంలోకి వ‌చ్చిన రెండో ఏడాది నుంచి ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని చెప్పాం. దేవుడి ద‌యతో ఆ కార్య‌క్ర‌మాన్ని మీ అన్న‌గా చేయ‌గ‌లుగుతున్నాను. దేవుడి ద‌యతో చేస్తున్నాన‌ని గ‌ర్వంగా చెబుతున్నాను.

చేయూత‌తో పాటు మ‌హిళ స్వ‌యం సాధికారత దిశ‌గా అడుగులు..

ఇందులో మ‌రో అడుగు ముందుకు వేస్తున్నా..ఇక్క‌డ బ‌ట‌న్ నొక్క‌గానే అక్క‌ల బ్యాంకు అకౌంట్ల‌లో జ‌మా అవుతుంది. ఈ డ‌బ్బుల‌ను బ్యాంకులు పాత బ‌కాయిల కింద జ‌మా చేసుకోకుండా మార్పు చేశాం. నేరుగా బ్యాంకు ఖాతాల్లో జ‌మా చేస్తాం. ఇంకో అడుగు ముందుకు వేస్తూ..ఆ అక్క‌ల‌కు ఇంకా మంచి జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో వాళ్ల‌కు కొన్ని బిజినెస్ అవ‌కాశాలు క‌ల్పించే విధంగా ప్ర‌య‌త్నం చేశాం. ఇందులో భాగంగానే పాల ఉత్ప‌త్తులు, సేక‌ర‌ణ‌కు సంబంధించి అమూల్ సంస్థ‌తో ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. రిల‌య‌న్స్‌, హిందుస్థాన్‌, ప్ర‌క్టార్ అనే సంస్థ‌, ఐటీసీ అనే సంస్థ‌ల‌తో ఒప్పందం చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా మంచి కంపెనీల‌తో ఒప్పందం చేసుకుంటాం. ఈ వ్యాపార అవ‌కాశాల‌ను ప్ర‌తి అక్క వ‌ద్ద‌కు చేర్చుతాం. డ‌బ్బులు మీ ఖాతాల్లో ప‌డిన త‌రువాత ఓ లెట‌ర్ కూడా మీకు వ‌స్తుంది. ఈ లెట‌ర్‌లో రెండో పేజీలో ఆప్ష‌న్ కాలమ్ కూడా ఇచ్చాం. ఈ వ్యాపార అవ‌కాశాలు ఉప‌యోగించుకొని మేలు పొందే విధంగా ఆప్ష‌న్స్ మీ ముందు పెడుతున్నాం. అముల్ సంస్థ‌తో మీరు ఏకీభ‌విస్తే..వాళ్లే గేదెలు కొనిస్తారు. వాళ్లే పాలు సేక‌రిస్తారు. వీళ్ల‌తో ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. మ‌హిళ‌ల‌కు అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నాం. బ్యాంకుల‌తో కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంవోయులు చేసుకుంది. ఐటీసీ, రిల‌య‌న్స్ వంటి సంస్థ‌లు ఏజెన్సీల‌కు ఇచ్చే రేటు క‌న్న త‌క్కువ రేటుకు ఇస్తారు. కాబ‌ట్టి ఇలాంటి వ్యాపారం చేస్తే లాభం జ‌రుగుతుంద‌న్న‌దే ప్ర‌భుత్వ ఉద్దేశం.

అక్క‌, చెల్లెమ్మ‌ల‌కు మంచి చేసేందుకే కంపెనీలు, బ్యాంకుల‌తో అవ‌గాహన ఒప్పందాలు రాష్ట్ర ప్ర‌భుత్వం చేసుకుంది. నేరుగా గ్రామ వాలంటీర్ల ద్వారా ల‌బ్ధిదారుల‌కు లెట‌ర్లు ఇస్తారు. మీలో ఎవ‌రైనా కూడా ఈ లెట‌ర్‌లో ఉన్న వ్యాపారం కావాల‌ని గ్రామ వాలంటీర్‌కు చెబితే, సెర్ఫ్‌, మెప్మా అధికారులు ల‌బ్ధిదారుల‌తో మాట్లాడి గ్రామ స‌చివాల‌యం ద్వారా స‌హ‌కారం అందిస్తారు. కంపెనీ ప్ర‌తినిధుల‌తో మాట్లాడి మేలు చేసి ఆ అక్క‌ల‌ను అధికారులు చెయ్యి ప‌ట్టుకొని న‌డిపిస్తారు. ఈ కార్య‌క్ర‌మం అన్న‌ది మ‌నం ఒక అడుగు ముందుకు వేసి నాలుగేళ్ల‌లో ప్ర‌తి ఏటా రూ.18,750 చొప్పున డ‌బ్బు ఇస్తున్నాం. నాలుగేళ్ల‌కు అది రూ.75 వేలు అవుతుంది.  ఈ డ‌బ్బును స‌ద్వినియోగం చేసుకొని ఆ అక్క‌, చెల్లెమ్మ‌లు త‌మ కాళ్ల మీద నిల‌బ‌డితే మంచిది. కానీ అదే చేయాల‌న్న‌ది ప్ర‌భుత్వం ఒత్తిడి చేయ‌డం లేదు. మీ అన్న‌గా వైయ‌స్ జ‌గ‌న్ మీ కోసం ..ఈ డ‌బ్బును మీ ఇష్టానికే వదిలిపెడుతున్నాం. ఈ డ‌బ్బును మీ ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఉప‌యోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాల‌న్న‌దే నా ఉద్దేశం.  రాష్ట్ర ప్ర‌భుత్వం  ఈ ప‌థ‌కం ద్వారా నాలుగేళ్ల‌లో అక్ష‌రాల రూ.17,000 కోట్లు ఖ‌ర్చు చేస్తోంది.

ఇంకా అర్హులై ఉండి, పొర‌పాటున జాబితాలో పేరు లేక‌పోతే కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న‌ప్ర‌భుత్వం ఉన్న‌ది ప్ర‌తి అక్క‌కు, చెల్లెమ్మ‌కు మేలు చేయాల‌న్న‌దే ప్ర‌ధాన ఉద్దేశం. గ్రామ స‌చివాల‌యానికి వెళ్లి అర్హ‌త‌ల ప్ర‌కారం ద‌య‌చేసి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకుంటే..గ్రామ స‌చివాల‌య ఉద్యోగులు వెరిఫికేష‌న్ చేసి ఈ నెల కాక‌పోతే, రేపు నెల‌లో మ‌ళ్లీ మిగిలిపోయిన వారంద‌రికీ వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం కింద డ‌బ్బులు జ‌మా చేస్తాం. దాదాపు 23 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ఈ ప‌థ‌కం కింద సంపూర్ణంగా మేలు జ‌ర‌గాల‌ని మ‌న‌సారా కోరుతున్నా. 58, 59, 60 ఏళ్లు వ‌య‌సు ఉన్న అక్క‌ల‌కు ఈ నాలుగేళ్లు డ‌బ్బులు అందుతాయి. ఆ త‌రువాత పింఛ‌న్ మంజూరు చేస్తాం. అలాగే 42, 43, 44 ఏళ్లు ఉన్న వారు ఈ ప‌థ‌కంలో జాయిన్ అవుతారు. ఈ ప్ర‌క్రియ నియంత‌రం కొన‌సాగుతుంది. మ‌హిళ‌లు త‌మ కాళ్ల‌పై నిల‌బ‌డేలా అన్ని చ‌ర్య‌లు ఈ ప్ర‌భుత్వం తీసుకుంటు తోడుగా ఉంటుంది. ఈ ప‌థ‌కం వ‌ల్ల ప్ర‌తి  అక్క‌కు, చెల్లెమ్మ‌కు మంచి జ‌ర‌గాల‌ని, దేవుడి ద‌య‌తో, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో ఇంకా కొంత మంచి  చేసేలా ఆశీర్వ‌దించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా..

 

తాజా వీడియోలు

Back to Top