రుయా ఆస్పత్రి ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం

ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించాలని ఆదేశం

చిత్తూరు: తిరుపతి రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఘటనకు దారి తీసిన కారణాలను గుర్తించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆస్పత్రుల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఆక్సిజన్‌ సరఫరాతో పాటు వ్యవస్థల నిర్వహణపై దృష్టిపెట్టాలని సూచించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top