కందుకూరు ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం

తాడేపల్లి: కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్ర‌తిప‌క్ష‌నేత‌ చంద్రబాబు ప్రచార ఆర్భాటంతో ఇరుకు సందులో ఏర్పాటు చేసిన రోడ్డుషోతో తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో 8 మంది టీడీపీ సానుభూతిప‌రులు మృతిచెందారు. ఆ  కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మానవతా దృక్పథంతో రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ప్రభుత్వం తరఫున సాయాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

Back to Top