ఐసీయూ బెడ్స్‌కు సరిపడా వైద్యులను నియమించాలి

కరోనా నియంత్రణ సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో అన్ని సదుపాయాలు ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్‌ అధికారులు, మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సరిపడా టెస్ట్‌ కిట్స్‌ తెప్పించుకోవాలని సీఎం ఆదేశించారు. ఐసీయూ బెడ్స్‌కు సరిపడా వైద్యులను నియమించాలన్నారు. 1902కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై అధికారులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదే విధంగా కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమాటా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top