సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

 తాడేపల్లి: నవంబర్‌ 14న తిరుపతిలో జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాట్లపై బుధవారం ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, మేకతోటి సుచరిత హాజరయ్యారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అధ్యక్షత వహించనున్న ఈ సమావేశాలకు ఏపీ ఆతిథ్యమిస్తోంది. ఏపీ, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా పాండిచ్చేరి, అండమాన్‌నికోబార్‌, లక్షద్వీప్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు హాజరవుతారు. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం.. కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిష్కారం కానీ పలు కీలకమైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.  

తాజా ఫోటోలు

Back to Top