స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై సీఎం సమీక్ష

కాలేజీల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

భవనాల నిర్మాణం నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ చల్లా మధుసూదన్‌ రెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రై నింగ్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.అనంతరాము, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ అర్జా శ్రీకాంత్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ, ఏపీలో 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల నిర్మాణం దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల కోసం 20 చోట్ల స్థలాలు గుర్తించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలజీల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణ అత్యంత నాణ్యంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్నారు. 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీల్లో కోర్సులు, పాఠ్యప్రణాళిక తయారీపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపైనా శిక్షణ ఇవ్వాలని, హై ఎండ్‌ స్కిల్స్‌తో పాటు ప్రతి కాలేజీలో కూడా ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపైనా యువతకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top