పంటనష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించండి

అకాల వర్షం, పంట నష్టంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అకాలవర్షం, పంట నష్టంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట నష్టం వివరాలు వెంటనే నమోదు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా పిడుగుపాటు, బోటు ప్రమాదాల్లో మరణించినవారికి 24 గంటల్లో పరిహారం చెల్లించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. 
 

Back to Top