ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
 
కోవిడ్‌ పరిస్థితులు, థర్డ్‌వేవ్‌, హెల్త్‌హబ్స్‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సమీక్ష

చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యం అందించాలి

రాష్ట్రంలో గణనీయంగా త‌గ్గిన క‌రోనా కేసులు  

దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా ఆరోగ్యశ్రీ నిలవాలి

జనావాసాలకు దగ్గరగా ఉండేలా హెల్త్ హబ్స్‌ ఏర్పాటు చేయాలి

 తాడేప‌ల్లి: క‌రోనా నేప‌థ్యంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించారు. సోమ‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ సమాచారంతో శిశువులు, చిన్నారుల వైద్యంపై తీసుకోవాల్సిన చర్యలు,  జిల్లాకేంద్రాల్లో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం వైయస్‌.జగన్ ‌సమీక్ష నిర్వ‌హించారు. 

 గణనీయంగా తగ్గిన కోవిడ్‌ కేసులు: 
– రాష్ట్రంలో  గణనీయంగా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించిన అధికారులు
– జూన్‌ 6 నుంచి 12 వరకూ... వారంరోజుల డేటాను సీఎంకు వివరించిన అధికారులు.
– జూన్‌ 12న 6.58శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు, మే 16న 25.56 శాతం
– అన్నిజిల్లాల్లో పాజిటివిటీ రేటు 17.5శాతం లోపేనని తెలిపిన అధికారులు
– 0–9శాతం లోపల 7 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఉందని తెలిపిన అధికారులు. 
– 10–19 శాతం మధ్య 6 జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఉందన్న అధికారులు. (చిత్తూరు,  అనంతపురం, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు)
– యాక్టివ్‌ కేసుల సంఖ్య 85,637 కు తగ్గిందని, రికవరీ రేటు 94.61శాతానికి చేరిందన్న అధికారులు. 
– 104 కాల్‌ సెంటర్‌కు ఏప్రిల్‌ 15 నుంచి 5 లక్షలకుపైగా కాల్స్, 6,41,093 ఔట్‌ గోయింగ్‌కాల్స్‌ వెళ్లాయన్న అధికారులు.
– ప్రస్తుతం రోజువారీ కాల్స్‌ సుమారు 2700 కు చేరాయన్న అధికారులు. 
–  జూన్‌ 12 వరకూ 2303 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదు, ఇందులో 157 మంది మృతి

– కోవిడ్ ‌కారణంగా మరణించిన వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదుకోవడంపై సీఎం ఆదేశాల ప్రకారం జీఓ జారీచేశామని తెలిపిన అధికారులు. 
– వారికి త్వరగా ఆర్థిక సహాయం అందేలా చూడాలని సీఎం ఆదేశం.  

 చిన్నారులు, శిశువులకు అత్యుత్తమ వైద్యంపై సీఎం సమీక్ష: 

– థర్డ్‌ వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సీఎం సమీక్ష
– రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో శిశువులకు వైద్యచికిత్స సదుపాయాలను వివరించిన అధికారులు
– శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను వివరించిన అధికారులు
– ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామన్న అధికారులు. 
– ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
– అలాగే అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక వేశామన్న అధికారులు.
– నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశం.
–ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలన్న సీఎం
– పీడియాట్రిక్‌ అంశాలల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాలన్న సీఎం
– కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్న అధికారులు.
– ఊపిరిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయన్న  అధికారులు.
– వీరికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశం
– ఆరోగ్య శ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్దారిస్తున్న రేట్లు వారిని ఇబ్బందులకు గురిచేసే రేట్లు కాకుండా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించి రేట్లు ఫిక్స్‌ చేయాలన్న సీఎం
– దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా ఆరోగ్యశ్రీ నిలవాలన్న సీఎం.
- ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు మూడు వారాలలోపే బిల్లులుచెల్లిస్తున్నామన్న సీఎం 
– ఆరోగ్య శ్రీ కింద ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు దేశంలో కొత్త ఒరవడికి నాంది పలికాయన్న సీఎం.
– బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులను చెల్లిస్తున్నామన్న అధికారులు.
– ఆరోగ్యశ్రీ పథకం అమల్లో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యమన్న సీఎం.
-సకాలంలో బిల్లులు చెల్లింపు అనేది ఆరోగ్యశ్రీ పథకం విశ్వసనీయతను పెంచుతుందన్న సీఎం 
- ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియఅని అధికారులకు స్పష్టం చేసిన సీఎం
– ఆరోగ్యా ఆసరాకూడా ఒక విప్లవాత్మక చర్యగా పేర్కొన్న సీఎం.
– ప్రతిరోజూ ఆరోగ్య శ్రీ పథకంపై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించిన సీఎం.
- అప్పుడే పేదవాడి మొహంలో చిరునవ్వు చూడగలుగుతామన్న సీఎం

 హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై సీఎం సమీక్ష: 

– జిల్లాలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విషయంలో కొన్ని సూచనలు చేసిన  సీఎం
– జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
– నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకురావాలన్న సీఎం
– దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయన్న సీఎం
– చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు, టెక్నాలజీ, సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే హెల్త్‌ హబ్స్‌ వెనుక ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేసిన సీఎం.
– ఉత్తమ వైద్యసేవల విషయంలో ఒక జిల్లాలో పరిస్థితి మెరుగుపడడానికి సంబంధిత హెల్త్‌హబ్‌కింద ఈ ఆస్పత్రులు తీసుకురావాలన్న సీఎం. 
– వైద్యసేవలను అందించే విషయంలో జిల్లాలు ఈ హెల్త్‌ హబ్‌లద్వారా స్వయం సమృద్ధి సాధించాలన్న సీఎం.
– సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాలి : సీఎం
– 2 వారాల్లోగా హెల్త్‌ హబ్‌పై విధివిధానాలు ఖరారు కావాలన్న సీఎం

ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య,ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), కోవిడ్ అండ్ కమాండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్‌ డాక్టర్ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అడిషనల్ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమాల్ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టీ.కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, 104 కాల్‌ సెంటర్ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top