కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్ర‌వారం ఏర్పాటు చేసిన స‌మావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం స‌హ్ని, డీజీపీ గౌతం స‌వాంగ్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, వైరస్‌ తీవ్రత వచ్చే నెల నాటికి మరింతగా తగ్గే అవకాశం ఉంది.  భారీగా నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేయూతనివ్వడం వల్లే దేశంలోనే ఏపీ కోవిడ్‌ నియంత్రణలో ముందంజలో ఉంది.  

Back to Top