వినూత్న మార్కెటింగ్‌ విధానాలతో ముందుకెళ్లాలి

రూ.100కే ఐదు రకాల పండ్ల పంపిణీ అభినందనీయం

కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: వినూత్న మార్కెటింగ్‌ విధానాలతో మార్కెటింగ్‌ శాఖ ముందుకెళ్లాలని సీఎం వైయస్‌ జగన్‌ సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ వంటి అంశాలపై చర్చించారు. అధికారులు పలు విషయాలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. 

"నిన్న ఒక్కరోజే ల్యాబ్‌లు, ట్రూనాట్‌ మిషన్ల ద్వారా 4 వేలకు పైగా కరోనా వైరస్‌ పరీక్షలు చేశాం. ర్యాపిడ్‌ కిట్స్‌, స్క్రీనింగ్‌ కోసం కొత్త పరికరాల సాయంతో గణనీయంగా పరీక్షల సామర్థ్యం పెరుగుతుంది. వారంలోగా ల్యాబ్‌ల సంఖ్యను 12కు పెంచుతాం. తిరుపతిలో రెండు, కర్నూలులో ఒకటి, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కో ల్యాబ్‌ చొప్పున పెంచుతాం. టెలీ మెడిసిన్‌కు స్పందన బాగా వస్తుంది. 5,219 మంది టెలీ మెడిసిన్‌కు కాల్‌ చేశారు. రిటర్న్‌ కాల్‌ చేసి వారికి వైద్య సేవలు అందించాం" అన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తదితరులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top