నీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ఉపేక్షించేది లేదు

జలవనరుల శాఖపై సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష
 

అమరాతి : సాగు, తాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  అధికారులకు స్పష్టం చేశారు. సమగ్ర నివేదిక, వివరాలతో మరోసారి రావాలని ఆధికారులను ఆదేశించడంతో గురువారం  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి జలవనరుల విభాగం పనితీరుపై మరోసారి సమీక్ష నిర్వహించారు. గతవారం కూడా జలవనరుల విభాగం అధికారులతో సీఎం వైయ‌స్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి కె.ధనంజయ్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top