పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్ అమలుకు సన్నద్ధం కండి

వైద్య, ఆరోగ్యశాఖ స‌మీక్ష‌లో సీఎం వైయస్‌.జగన్  

అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలన్న సీఎం

వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించుకోండి

నెట్‌వ‌ర్క్ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌

డయాలసిస్‌ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని సీఎం ఆదేశం

తాడేప‌ల్లి: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలని సూచించారు. 
ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలని ఆదేశించారు. ఆలోగా విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. ఉగాది కల్లా వీటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గురువారం తాడేప‌ల్లిలోని  ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఆరోగ్యశ్రీ, నాడు – నేడు కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు.

 • అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై సీఎం సమగ్ర సమీక్ష.
 • ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాజెక్టు అమలుకోసం తీసుకుంటున్న చర్యలను, పైలెట్‌ ప్రాజెక్టు అమల్లో గుర్తించిన అంశాలను వివరించిన అధికారులు.
 • 26 జిల్లాల్లో నెలరోజుల వ్యవధిలో 7166  విలేజ్‌ క్లినిక్స్‌లలో రెండుసార్లు చొప్పున, 2866 విలేజ్‌ క్లినిక్స్‌లలో ఒకసారి చొప్పున ఫ్యామిలీ డాక్టర్‌ 104–వాహనంతో పాటు వెళ్లారన్న అధికారులు.
 • డిసెంబర్‌లో అదనంగా మరో 260 .. 104 వాహనాలు సమకూర్చుకుంటున్నామన్న అధికారులు.
 • దీంతో పూర్తిస్థాయిలో 104 వాహనాలు అందుబాటులో ఉన్నట్టు అవుతుందన్న అధికారులు.
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వల్ల వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం, సమర్థత గణనీయంగా పెరిగాయన్న అధికారులు.
 • సిబ్బంది భాగస్వామ్యం కూడా బాగా పెరిగిందన్న అధికారులు.
 • సీఎం ఆదేశాల మేరకు పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపైన కూడా పరిశీలన చేస్తున్నామన్న అధికారులు.
 • ఎనీమియాతో బాధపడుతున్న వారిని కూడా గుర్తించి చికిత్స అందిస్తున్నామన్న అధికారులు.
 • పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నెలరోజుల వ్యవధిలో 7,86,226 మందికి సేవలందించామని వెల్లడి. 
 • హైపర్‌ టెన్షన్‌తో బాధపడుతున్న 1,78,387 మందిని గుర్తించగా, 1,25,948 మంది మధుమేహంతో బాధపడుతున్నారన్న వివరించిన అధికారులు. 
 • వీరికి మందులు ఇస్తున్నామన్న అధికారులు

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...: 

 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లో క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాదు, వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నదానిపై సూచనలు కూడా ఇవ్వాలన్న సీఎం.
 • వైద్య సిబ్బంది ఈ విషయంలో పూర్తి మార్గదర్శకంగా ఉండాలన్న సీఎం.
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి తగిన స్థాయిలో సన్నద్ధం కావాలని సీఎం ఆదేశం. 
 • అవసరాలకు తగిన విధంగా 104 వాహనాలను సమకూర్చుకోవాలన్న సీఎం. 
 • ఎక్కడా ఖాళీలు లేకుండా సిబ్బందిని భర్తీచేయాలన్న సీఎం.
 • ఆలోగా విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • ఉగాది కల్లా వీటిని పూర్తిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలులో స్త్రీ శిశుసంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశాలు.
 • పిల్లలు, గర్బవతులు, బాలింతల్లో ఎనీమియాతో బాధపడుతున్న వారిని గుర్తించి ఆ డేటాను స్త్రీ శిశుసంక్షేమశాఖకు బదిలీచేయాలన్న సీఎం.
 • డేటా ప్రకారం ఆయా లక్షణాలున్నవారికి పౌష్టికాహారం, మందులు అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం. 
 • గ్రామ సందర్శనలో భాగంగా ఫ్యామిలీ డాక్టర్‌ ఆ గ్రామంలో మంచానికి పరిమితమైన రోగులను తప్పనిసరిగా కలవాలన్న సీఎం. 
 • వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలన్న సీఎం.
 • ఆరోగ్యశాఖలోని ఆశా వర్కర్‌ స్ధాయి వరకూ కూడా ట్యాబులు లేదా సెల్‌ఫోన్లు ఇవ్వాలన్న సీఎం.
 • ఇందులో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి అమలు చేస్తున్న ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన యాప్‌లు ఉంచాలని ఆదేశం. 
 • ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కలిగించాలన్న సీఎం
 • ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాలన్న సీఎం.
 • ఎవరికైనా ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందించాలంటే.. సంబంధిత చికిత్సను అందించే నెట్వర్క్‌ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌ను రూపొందించాలన్న సీఎం.
 • సంబంధిత ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ కూడా చూపేలా ఈ యాప్‌ ఉండాలన్న సీఎం.
 • ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేసే పరిస్థితి రావాలన్న సీఎం. 
 • ప్రజలకు కూడా ఈ యాప్‌ అందుబాటులో ఉండేలా చూడాలన్న సీఎం.
 • ఆరోగ్య శ్రీసాప్ట్‌వేర్‌ కూడా బాగా మెరుగుపరచాలని సీఎం ఆదేశం.
 • ఎవరైనా తమకు వైద్యం కోసం ఎక్కడకు వెళ్లాలి? ఏ జబ్బుకు ఎక్కడ వైద్యం అందుతుంది? దీనికి ఆరోగ్య శ్రీ సేవలు ఎక్కడ అందుతాయి అన్నదానిపై లొకేషన్‌ సైతం తెలియజేసేలా యాప్‌లో వివరాలు ఉండాలన్న సీఎం.
 • అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ సంబంధిత గ్రామానికి వెళ్లినప్పుడు కూడా రియల్‌టైం డేటా కూడా రికార్డు చేయాలన్న సీఎం.
 • దీనివల్ల సిబ్బంది మధ్య సమన్వయం, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య కూడా సమన్వయం చక్కగా కుదురుతుందన్న సీఎం.
 • ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ పర్యవేక్షణకు సమర్థయంత్రాంగం ఉండాలన్న సీఎం. 
 • రాష్ట్రస్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులను ఉంచాలని ఆదేశం.
 • రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు కూడా ఆదేశం.
 • ఆరోగ్యరంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలని, విలేజ్‌ క్లినిక్స్‌ సహా అన్నిచోట్లా  ఈ నంబర్‌ను ఉంచాలని సీఎం ఆదేశం.
 • ఆరోగ్య శ్రీ సేవల విషయంలో జరిగిన ఏమైనా తప్పులు ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
 • సరిగ్గా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలన్న సీఎం. 
 • నెగిటివ్‌ ఫీడ్‌బ్యాక్‌పై కచ్చితంగా పరిశీలన, చర్యలు ఉండాలన్న సీఎం.
 • డయాలసిస్‌ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలని సీఎం ఆదేశం. 
 •  

ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ జి నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీంద్రప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top