మూడు విడతల్లో సమగ్ర భూ సర్వే

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

రెవెన్యూ శాఖలో భూముల రీ సర్వేపై సీఎం సమీక్ష

తాడేపల్లి: మూడు విడతల్లో సమగ్ర భూ సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖలో భూముల రీ సర్వేపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా... భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం వైయస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామని, సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామని సీఎంకు వివరించారు. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయిలో మొబైల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్‌ పద్ధతిలో ఎన్‌క్రిప్ట్‌ చేస్తామని వెల్లడించారు. ఆలస్యం లేకుండా సమగ్ర భూసర్వే మొదలు పెట్టాలని, మూడు విడతల్లో సర్వే చేయాలని సీఎం ఆదేశించారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, మండలాల వారీగా సర్వే చేయాలని సూచించారు. సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. 
 

Back to Top