ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు

5.3 కోట్ల మందికి 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయం

తాడేపల్లి: ఒక్కొక్కరికీ మూడు మాస్కుల చొప్పున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 5.3 కోట్ల మందికి, ఒక్కొక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కుల పంపిణీ చేయాలని ఆయన స్పష్టం చేశారు. మాస్కుల వల్ల కొంత రక్షణ లభిస్తుందని, వీలైనంత త్వరగా పంపిణీ జరగాలని అధికారులను ఆదేశించారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం సూచన అమల్లోకి తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధించింది. ఉమ్మివేయడం, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి పడేయడంపై నిషేధం విధిస్తూ.. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించేలా ఉత్తర్వులు జారీ చేసింది.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top