ఇరిగేష‌న్ శాఖ‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్ర‌ధాన ప్రాజెక్టుల‌పై చ‌ర్చ‌

పోల‌వ‌రం ప‌నులు అంత‌రాయం లేకుండా జ‌ర‌గాల‌ని సీఎం ఆదేశం

తాడేపల్లి: ఇరిగేషన్‌ శాఖపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన ప్రాజెక్టులపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష చేపట్టారు. 

అక్టోబర్‌లో అవుకు టన్నెల్‌–2, వెలిగొండ మొదటి టన్నెల్, నెల్లూరు, సంగం బ్యారేజీల ద్వారా సాగునీరు వంశాధార–నాగావళి లింక్‌ ద్వారా డిసెంబర్‌లో నీటి విడుదల, నవంబర్‌లో పోలవరం గేట్ల బిగింపునకు ప్రయత్నాలు వంటి అంశాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించారు. అదే విధంగా వర్షాకాలంలోనూ అంతరాయం లేకుండా పోలవరం పనులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారు. గతేడాది గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని పునరావాస పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top