ప‌రిశ్ర‌మ‌ల భ‌ద్ర‌త‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

భ‌ద్ర‌త‌, ప్ర‌మాదాలు, కాలుష్య నివార‌ణ అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌

తాడేప‌ల్లి: పారిశ్రామిక ప్ర‌మాదాల‌కు బాధ్యులైన వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప‌రిశ్ర‌మ‌ల భ‌ద్ర‌త‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు అజేయ క‌ల్లం, స్పెష‌ల్ సీఎస్ నీర‌బ్ కుమార్‌, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. స‌మావేశంలో ప‌రిశ్ర‌మ‌ల్లో భ‌ద్ర‌త‌, ప్ర‌మాదాలు, కాలుష్య నివార‌ణ అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఏడాదికి రెండుసార్లు కాంప్లియ‌న్స్ నివేదిక దాఖ‌లు చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించారు. నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప‌ర్య‌వేక్ష‌ణ యంత్రాంగం బ‌లంగా ఉండాల‌ని, వీటిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్న అంశాన్ని సంబంధిత కంపెనీలు బోర్డుల‌పై పెట్టాల‌ని, థ‌ర్డ్ పార్టీ త‌నిఖీలు కూడా ఉండాలన్నారు. విశాఖ గ్యాస్ ఘ‌ట‌న‌లో ఇన్‌హెబిట‌ర్స్ ఉంటే ప్ర‌మాదం జ‌రిగేది కాదని అభిప్రాయ‌ప‌డ్డారు. పారిశ్రామిక ప్ర‌మాదాల‌కు బాధ్యులైన వారిప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. ఎవ‌రైనా ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే.. రూ.50 ల‌క్ష‌ల ప‌రిహారం ఇచ్చేలా విధానంలో పొందుప‌ర‌చండి అని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top