తాడేపల్లి: పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామని చెప్పారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీచేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని వెల్లడించిన అధికారులు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు. సీఎం ఆదేశాలమేరకే ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం. ఇప్పటివరకూ 11.03 లక్షలమందికి రూ. 35 వేల చొప్పున రుణాలు. రూ. 3886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు ఇప్పించినట్లు చెప్పారు. గృహనిర్మాణశాఖపై సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే...: సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.... వేగంగా నిర్మాణ పనులును ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్న సీఎం. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం. పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయన్న సీఎం. సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామన్న అధికారులు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీచేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం ఆదేశం. 5024 టిడ్కో ఇళ్లను అందించనున్న ప్రభుత్వం. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, సీసీఎల్ఏ సెక్రటరీ ఏ ఎండీ ఇంతియాజ్, ఏపి టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ లక్ష్మీషా, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.