సొంత ఇల్లు అనేది పేదవాడి కల

గృహనిర్మాణశాఖపై  స‌మీక్ష‌లో సీఎం వైయస్‌.జగన్ 

ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడ‌దు

మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశ‌గా చ‌ర్య‌లు

ఉచితంగా  టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించడం ద్వారా మరో రూ.1200 కోట్లు ప్ర‌భుత్వంపై భారం  

అమరావతి: సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని ముఖ్య‌మంత్రి స్పష్టంచేశారు. ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలని ఆదేశించారు. పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్‌ కనెక్షన్ ఇవ్వాల‌ని సూచించారు.  పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో అధికారులు ఇళ్ల నిర్మాణాల పురోగ‌తిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబరు నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించిన అధికారులు.

 •  ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపంలేకుండా చూడాలంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తీసుకున్న చర్యలను వివరించిన అధికారులు.
 •  స్టేజ్‌ కన్వెర్షన్‌ కూడా బాగా జరిగిందని వివరించిన అధికారులు.
 •  ఇళ్లనిర్మాణాల్లో నాణ్యతను పరీక్షించేందుకు మొత్తంగా 36 ల్యాబులు ఏర్పాటు చేశామని వెల్లడి. 
 •  ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించే మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు, సిమెంటుపైన 34 పరీక్షలు, స్టీలుపై 84 పరీక్షలు, ఇటుకలపైన 95 టెస్టులు.... ఇలా పలురకాల పరీక్షలు నిర్వహించామన్న అధికారులు.
 •  ఎక్కడ లోపం వచ్చినా.. వెంటనే గుర్తించి.. నాణ్యతను పెంచుకునేందుకు ల్యాబులు వినియోగపడుతున్నాయన్న అధికారులు.
 • ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...
 •  సొంత ఇల్లు అనేది పేదవాడి కల అని, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని స్పష్టంచేసిన సీఎం.
 •  ఈ ల్యాబులను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్న సీఎం. 
 •  సీఎం ఆదేశాల మేరకు పూర్తయిన ఇళ్లకు 15 రోజుల్లోగా విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్న ట్రాన్స్‌కో. 
 •     
 •  లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. 
 •  లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలన్న సీఎం. 
 •  కోర్టుకేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు వెల్లడి.
 •  సుమారు 30 వేలమందికి ఇళ్లనిర్మాణం కోర్టుకేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి.
 •  దీనికోసం అసవరమైన భూ సేకరణకోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం. 
 •  ఇళ్ల నిర్మాణ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ చేసిన ఖర్చు రూ.7630 కోట్లు.
 •  ఈ ప్రభత్వం ఇప్పటివరకూ మొత్తంగా రూ.13,780 కోట్లు కేవలం ఇళ్ల నిర్మాణం కోసమే ఖర్చు చేసింది. 
 •  ఇప్పటివరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని, మరో మరో 74వేల ఇళ్లలో శ్లాబు వేసే పనులు జరుగుతున్నాయని, మరో 79 వేల ఇళ్లు రూఫ్‌ లెవల్లో ఉన్నాయని తెలిపిన అధికారులు.
 •  మార్చి నాటికి పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద చేపట్టిన ఇళ్లలో సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపిన అధికారులు.

 టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష:

 •  టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం గణనీయంగా సహాయం అందించిందని తెలిపిన సీఎం. 
 •  ఈ మూడున్నర సంవత్సరాలలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉచితంగా 300 అడుగులు ఇళ్లు, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై  సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసిన ప్రభుత్వం.  
 •     అధికారులు అందించిన వివరాలు ప్రకారం... టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8015 కోట్లు అయితే ఈ ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాలు విలువ చూస్తే మొత్తంగా రూ.20,745 కోట్లని తెలిపిన సీఎం.
 •  టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చుకింద, మౌలిక సదుపాయాలకోసం ఈ మూడున్నర సంవత్సరాల్లోనే రూ.8,734 కోట్లు ఖర్చుచేశామని, దీంతోపాటు 300 అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం వల్ల దాదాపు రూ.10,339 కోట్ల రూపాయల లబ్ధి పేదలకు జరిగిందని తెలిపిన సీఎం. 
 •  వీరు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బును పూర్తిగా మాఫీ చేయడమేకాకుండా, బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేకుండా, నెలా నెలా వాయిదాలు కట్టాల్సిన పనిలేకుండా పూర్తి ఉచితంగా ఆ ఇళ్లను అందిస్తున్నామన్న సీఎం. 
 •  మిగిలిన వారికీ ఊరట కల్పించే చర్యల్లో భాగంగా దాంతోపాటు 365 మరియు 430 చదరపు అడుగులు ఇళ్లకు లబ్ధిదారులకు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ. 482 కోట్ల మేర లబ్ధిజరిగిందని, ఆమేరకు ప్రభుత్వం ఆ భారాన్ని కూడా తీసుకుందన్న సీఎం. 
 •  అలాగే రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను కూడా తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేయించడం ద్వారా మరో రూ.1200 కోట్ల భారాన్ని ప్రభుత్వం తీసుకుందని తెలిపిన సీఎం.
 •  నిర్మాణ ఖర్చులు, పైన కల్పించిన ప్రయోజనాలు ద్వారా ప్రభుత్వం తీసుకున్న భారంగా చూస్తే రూ.20,745 కోట్లు ఈ ప్రభుత్వం టిడ్కో ఇళ్లమీద పెట్టిందని తెలిపిన సీఎం. 
 • పేదలందరికీ ఇళ్ల కింద ప్రభుత్వం ఇప్పటివరకూ చేసిన ఖర్చు.
 • ఇళ్ల నిర్మాణం కోసం, ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామాగ్రిని అందించడం వలన కలిగిన ప్రయోజనం రూపేణా ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ.13,757.7 కోట్లు. 
 • ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు.
 • తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారుల తదితర సదుపాయాల కోసం చేస్తున్న ఖర్చు రూ.32,909 కోట్లు.
 • అంటే కేవలం జగనన్న కాలనీల్లో కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే చేసిన ఖర్చు రూ.36,026 కోట్లు.
 • పేదలకు ఇళ్ల పట్టాల కింద ప్రభుత్వ భూములు 28,554.64 ఎకరాలు.
 • వీటి విలువ రూ.17,132.78 కోట్లు.
 • ఇళ్ల పట్టాల పంపిణీకోసం ప్రభుత్వం డబ్బు పెట్టి కొన్న భూమి 25,374.66 ఎకరాలు.
 • ఈ భూముల విలువ సుమారు. 15,364.5 కోట్లు.
 • విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు.
 • ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలు.
 • వీటి విలువ రూ.11,200.62 కోట్లు.
 • మొత్తమ్మీద అన్ని రకాలుగా ఇళ్లపట్టాల రూపేణా పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు.
 • ఈ భూములు విలువ రూ.56,102.91 కోట్లు.
 • పేదలంరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, కార్యక్రమం విలువ మొత్తం రూ.1,05,886.61 కోట్లు.
 • మూడున్నరేళ్లలో పేదలకు సొంతింటి కలను నిజం చేసేందుకు గతంలో ఏ ప్రభుత్వ హయాంలో జరగని విధంగా ఖర్చు చేసిన  ప్రభుత్వం.
Back to Top