కరోనా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచండి

కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష
 

 
తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచాలని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కరోనా  నివారణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.  రాష్ట్రంలో గత 24 గంటల్లో7,320 శాంపిళ్లను పరీక్షించగా 54 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని హెల్త్‌ స్పెషల్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు. రాష్ట్రంలో  కరోనా కేసుల సంఖ్య 1,887 నమోదు అయ్యిందని, వారిలో ఇప్పటివరకు 842 మంది డిశ్చార్జ్ కాగా, 41 మంది మరణించారని వివరించారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,004గా ఉందని తెలిపారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 16, చిత్తూరులో 3, గుంటూరులో 1, కృష్ణాలో 6, కర్నూలులో 7, విశాఖపట్నంలో 11, విజయ నగరంలో 1 కేసు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 9 కేసులు నమోదయ్యాయి. కరోనా రోగులకు అందుతున్న సేవలు, వలస కూలీల తరలింపు, క్వారంటైన్‌ సెంటర్లలో వసతులపై సీఎం వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హెల్త్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య అధికారులు పాల్గొన్నారు. 

Back to Top