భేదాలు లేకుండా వ్యవస్థ సమాంతరంగా కొనసాగాలి

  పులివెందుల నియోజకవర్గంపై సమీక్షలో ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

వైయ‌స్ఆర్‌ జిల్లా: వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్ష ఉండకూడదని.. నా వాడు, నీ వాడు అన్న భేదాలు లేకుండా వ్యవస్థ సమాంతరంగా కొనసాగాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రభుత్వ పాలసీల అమలుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఆయ‌న‌ కోరారు. సచివాలయాల ద్వారా ప్రజల లోగిళ్లకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు సంతృప్తికరంగా కొనసాగుతున్నాయని  ముఖ్యమంత్రి అన్నారు.  వైయ‌స్ఆర్‌ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శుక్రవారం ఆయన ఇడుపులపాయ నెమ్మళ్ల పార్కు వద్ద పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై మూడు విడతలుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేతలు, అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలువురు నేతలు, కార్యకర్తలు, స్థానిక బంధువులు, స్నేహితులను ఒకే చోట చూసిన ఆనందంలో అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. అందరితో మమేకమై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆరా తీశారు. కలెక్టర్‌ వి.విజయరామరాజు, పాడా ఓఎస్‌డీ అనిల్‌కుమార్‌రెడ్డిలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు.
 
ఈ సందర్భంగా చక్రాయపేట, వేంపల్లె రూరల్, అర్బన్‌ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయా ప్రాంతాల నేతలు ముఖ్యమంత్రిని కోరారు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలిపారు. తమ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంపై వారు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పలువురు నేతలు వినతి పత్రాలు అందజేశారు. వాటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, అధికారులందరికీ సీఎం అభినందనలు తెలిపారు.  

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌లో ముఖ్యాంశాలు ఇలా..

సొంత నియోజకవర్గ ప్రజలపై మమకారం, స్థానిక బంధువులు, స్నేహితులు, సన్నిహితులను ఒకేచోట కలిసిన ఆనందంతో.. నియోజకవర్గ నాయకులను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

* పాడా అభివృద్ధి పనుల పురోగతిపై.. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంక్షిప్తంగా జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు వివరించగా... చక్రాయపేట మండలం, వేంపల్లె రూరల్, అర్బన్ ప్రాంతాలతో పాటు.. పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న మొత్తం అభివృద్ధి పనుల పురోగతిపై.. పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించిన పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి.

* చక్రాయపేట మండలంలో వందల కోట్ల అభివృద్ధి పనుల్లో భాగంగా.. ప్రధానంగా కాలేటివాగు ప్రాజెక్టు నిర్మాణం, గండి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని.. తెలియజేయడం సంతోషించదగ్గ విషయం అని.. ఇది మండలానికి శుభపరిణామం అని తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి.

* పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ(పాడా) పరిధిలో .. చక్రాయపేట మండలాన్ని విలీనం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం అని, అందుకు ముఖ్యమంత్రికిధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్న పలువురు చక్రాయపేట మండల నాయకులు.

* చక్రాయపేట మండల పరిధిలోని వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగులో ఉన్నాయని.. మండలంలో మామిడి పల్ఫీ జ్యూస్ ఫ్యాక్టరీ (ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) ఏర్పాటు చేయాలని.. ముఖ్యమంత్రి దృష్ఠికి తీసుకొచ్చారు. అంతేకాకుండా.. పలు అంశాలపై ముఖ్యమంత్రికి వినతి పత్రాలను అందివ్వడంతో పాటు, నేరుగా ముఖ్యమంత్రికి  విన్నవించిన నాయకులు.

* చక్రాయపేట మండలంలో 72 వేల ఎకరాల్లో భూములకు పుష్కలంగా సాగునీరు అందుతోందని, అభివృద్ధి వేగంగా జరుగుతోందని.. చాలా.మంది చదువుకున్న వారున్న.ఈ మండలంలో.. ఫ్యాక్టరీ నిర్మించాలని.. ముఖ్యమంత్రిని కోరిన పలువురు మండల నాయకులు.

* దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న ఏపీ భవన్ లో దివంగత నేత డా.వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చెయాలని.. మండల ప్రజల తరపున ముఖ్యమంత్రిని కోరిన జెడ్పిటిసీ ప్రభాకర్ రెడ్డి.

* వేంపల్లె రూరల్ నాయకులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రికి.. మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ద్వారా క్లుప్తంగా వివరించగా.. పలువురు నాయకులు.. పలు అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రికి సలహాలు ఇచ్చారు.

* వేంపల్లె టౌన్ లోనే పాడా నుండి.. రూ.63 కోట్ల వ్యయంతో.. పలు రకాల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు వివరించగా.. మొత్తం రూ.222.33 కోట్ల వ్యయంతో వివిధ శాఖల నుండి నిధులను ఖర్చు చేస్తూ.. నిర్మిస్తున్న, ఇప్పటికే నిర్మితమైన పలు నిర్మాణాలను ఒక్కొక్కటిగా పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి పిపిటి ద్వారా వివరించారు.

* *వేంపల్లె పట్టణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే.. నూతన పాఠశాల నిర్మాణం, డా.వైఎస్ఆర్ మెమోరియల్ పార్కు నిర్మాణంతో.. వేంపల్లె రూపురేఖలు మాత్రమే కాకుండా.. వేంపల్లె వాసుల జీవన శైలిని మార్చేసినందులకు... మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసిన జెడ్పిటిసీ రవికుమార్ రెడ్డి.

* ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గ కేంద్రంలో.. నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడంపై ఆనందం, సంతోషాన్ని వ్యక్తం చేసిన నాయకులు.
 
* సమావేశానికి హాజరైన జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిములపు సురేష్, కడప ఎంపి అవినాష్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ధనుంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సా)యికాంత్ వర్మ, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి  తదితరులు.
 
* ప్రభుత్వం ఒక పాలసీ అమలు చేస్తోందంటే.. అందుకు అన్ని వర్గాల ప్రజలు సమ్మతంగా అమలయ్యేందుకు సహకరించాలి. గ్రామ లోగిళ్ళలోనే.. సచివాలయాల ద్వారా.. ప్రభుత్వ సేవలు సంతృప్తి కరంగా సాగుతున్నాయి. వ్యవస్థ సక్రమంగా నడవాలంటే.. ఎక్కడా వివక్ష అనేది జరగకూడదని, నా వాడు, నీవాడు అన్న బేధాలు లేకుండా వ్యవస్థ సమాంతరంగా కొనసాగాలని.. తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి.

* నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా.. అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా... కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా అత్యంత పారదర్శకంగా అలుపెరుగకుండా శ్రమిస్తున్న వైసిపి నాయకులకు, అధికారులకు అభినందనలు తెలియజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

Back to Top