కోవిడ్‌ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలి

అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైయస్‌ జగన్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్‌ నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100 జరిమానా కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. దుకాణాల్లో సిబ్బంది నుంచి వినియోగదారుల వరకు మాస్క్‌ ధరించాల్సిందేనన్నారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలు విధించాలని, అవసరం అయితే 2, 3 మూడు రోజులు దుకాణాలు మూసివేతకు ఆదేశాలిచ్చారు. కోవిడ్‌ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానా విధించాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాలని, ప్రజలెవ్వరూ గుమికూడకుండా కఠిన ఆంక్షలు, మార్కెట్లు తదితర చోట్ల కూడా మాస్కులు ధరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top