కోవిడ్‌-19 నివార‌ణ చ‌ర్య‌ల‌పై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: కోవిడ్‌ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఇప్ప‌టికే క‌ర్ఫ్యూను జూన్ 10వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌.. క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అదే విధంగా ఆస్ప‌త్రుల్లో అందిస్తున్న వైద్య సేవ‌లు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా, వ్యాక్సినేష‌న్‌పై అధికారుల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశానికి వైద్య,ఆరోగ్యశాఖ ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, అదనపు డీజీపీ రవిశంకర్‌ అయ్యన్నార్‌,  వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్ ఇన్‌చార్జ్ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top