కరోనా నివారణ చర్యలపై సీఎం సమీక్ష ప్రారంభం

తాడేపల్లి: కోవిడ్‌–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. కరోనా టెస్టులు, క్వారంటైన్‌లలో వసతులు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు, కాల్‌ సెంటర్ల పనితీరు, వైద్య సిబ్బంది నియామకాలు, హోంక్వారంటైన్‌లో ఉన్నవారికి కల్పిస్తున్న సదుపాయలు వంటి అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌ సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top