90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం ఆదేశం

104 వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ

కోవిడ్‌ను తొలిసారి ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చింది మన రాష్ట్రమే

జూలై 1న కొత్త 104, 108 వాహనాలను ప్రారంభించనున్నాం

ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి కోవిడ్‌ పరీక్షలు చేయాలి

అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

కోవిడ్‌–19 నివారణ చర్యలపై సమీక్షా సమావేశం

తాడేపల్లి: 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలిచ్చారు. వచ్చే 90 రోజుల్లో ప్రతి ఇంటికి అవగాహన కల్పించి పరీక్షలు చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌–19 చికిత్సను అందిస్తున్న తొలి రాష్ట్రం మనదేనని గుర్తుచేశారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్‌ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, నోడల్‌ ఆఫీసర్‌ కృష్ణబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులు పలు ఆదేశాలిచ్చారు. 

104 వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. 104 వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ చేపట్టాలని, షుగర్, బీపీ లాంటి వాటికి పరీక్షలు చేసి అక్కడే మందులివ్వాలని సూచించారు. అమసరమైన  వారిని పీహెచ్‌సీకి రిఫర్‌ చేయాలని ఆదేశించారు. 104 స్టాఫ్‌తో పాటు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లను అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. 

ప్రతి నెలలో ఒకరోజు తప్పనిసరిగా గ్రామానికి 104 వాహనం వెళ్లాలని సీఎం ఆదేశించారు. కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో 50 శాతం కోవిడ్‌ పరీక్షలు, మిగతా 50 శాతం పరీక్షలు మిగిలిన చోట్ల చేయాలని ఆదేశించారు. కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకునేవారికి కేటాయించాలన్నారు. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి కూడా కోవిడ్‌ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు ఎస్‌ఓపీని తెలియజేయాలని, ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలన్నారు. వచ్చే 90 రోజుల్లో ప్రతి ఇంటికి అవగాహన కల్పించి పరీక్షలు చేయాలని ఆదేశించారు.  

ప్రతీ పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవేర్‌నెస్‌ పెంచి ప్రచారాన్ని హైలెట్‌ చేయాలని సూచించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రిపోర్టు చేసేలా ఉండాలని, ప్రతి ఒక్కరూ శానిటేషన్‌పై దృష్టిపెట్టాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేలా హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  

రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల్లో 1.20 కోట్ల కార్డుల పంపిణీ పూర్తి చేశామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. మిగిలిన ఆరోగ్య కార్డుల పంపిణీ కూడా త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఆరోగ్య కార్డుల పంపిణీ పూర్తయ్యాక ప్రతి మనిషి ఆరోగ్య వివరాలు ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని ఆదేశించారు. 104, 108 కొత్త వాహనాలు జూలై 1న ప్రారంభిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. 
 

తాజా వీడియోలు

Back to Top