‘ఆరోగ్య ఆసరా’కు ఇబ్బంది రాకూడదు

ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించండి

టెలీ మెడిసిన్‌ సరఫరాకు కొత్త బైక్‌లు కొనుగోలు చేయండి

సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

1,060 అంబులెన్స్‌లను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం

తాడేపల్లి: ఆరోగ్య ఆసరా పథకం విషయంలో ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించాలని ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ టెలీ మెడిసిన్‌ సరఫరా కోసం కొత్త బైక్‌లను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1,060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయించారు. 

చేపలు, రొయ్యలకు స్థానికంగా మార్కెటింగ్‌ కల్పించాలని సీఎం సూచించారు. స్థానికంగా చేపలు, రొయ్యల అమ్మకాలపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. చేపలకు ధర, మార్కెటింగ్‌ విషయాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. కోల్డ్‌ స్టోరేజీలు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, గోడౌన్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top