తాడేపల్లి: రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సారిగా రైతులకు ఖరీఫ్‌కు సంబంధించిన ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇదే సీజన్‌లో ఇచ్చేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్‌లోని జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన ఇన్‌ఫుట్ సబ్పిడీకి అవసరమైన నిధులను విడుదల చేస్తున్నామని, రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ అందించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలు, సహాయక చర్యలు, స్పందన కార్యక్రమం, నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, ఆసుపత్రులపై సీఎం వైయస్ జగన్ సమీక్షించారు. ఈ నెల 21న ప్రారంభిస్తున్న వైయస్ఆర్ బీమాపై చర్చించారు.స్కూళ్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చేపడుతున్న పనుల వివరాలపై సీఎం ఆరా తీశారు.సచివాలయాలు, ఆర్‌బీకే సెంటర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. ఉచిత విద్యుత్- రైతు అకౌంట్లో నగదు జమ అంశాలపై సీఎం వైయస్ జగన్ చర్చించారు. సీఎం వైయస్ జగన్ సమీక్ష ముఖ్యాంశాలు -7 ప్రధాన అంశాలపై సమీక్ష నిర్వహించిన సీఎం. -వర్షాలు, కోవిడ్, ఎన్‌ఆర్‌ఈజిఎస్, నాడునేడు, విలేజీ, వార్డు సెక్రటేరియట్స్ తనిఖీలు తదితర అంశాలు -వర్షాలకు సంబంధించి కలెక్టర్లుతో ప్రత్యేకంగా ఈ నెల 14న సమీక్ష నిర్వహించాం. -కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో.. .వారికి వెంటనే సాయం చేయండి -కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లందరూ31 అక్టోబరులోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయండి. -వెంటనే రోడ్ల మరమ్మత్తులు మొదలుపెట్టండి ఆర్ అండ్ బి, పంచాయితీరాజ్ రోడ్లపై ధ్యాస పెట్టండి. -కరెంటు పునరుద్ధరణ కలెక్టర్లు వేగంగా చేశారు. కలెక్టర్లందరికీ అభినందనలు. -కలెక్టర్లకు, జేసీలకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం. -ఈనెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం.