తాడేపల్లి: నూతన ఇసుక పాలసీపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను చర్చించనున్నారు.