తాడేపల్లి: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం ప్రాధాన్య ప్రాజెక్టులు, వైయస్‌ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు నీలం సాహ్ని, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పురపాలక, పట్టణాభివృద్ధి స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌జైన్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎన్ పి రామకృష్ణా రెడ్డి, స్వచ్ఛ ఆంధ్రా కార్పొరేషన్ ఎండీ పి సంపత్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.