చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలి

`ఆడుదాం ఆంధ్ర` క్రీడా సంబ‌రాల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి:  చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సూచించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిర్వహించనున్న క్రీడా సంబరాలపై  క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి సమీక్ష నిర్వ‌హించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పోటీల నిర్వహణపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు.

ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఏమన్నారంటే... :
– ఈ ఆటలను అత్యంత ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహించాలి: సీఎం 
– చక్కటి స్ఫూర్తిని నింపేలా ఆటల పోటీలు సాగాలి: సీఎం
– గ్రామీణ ప్రాంతాల్లో టాలెంట్‌ ఉన్న క్రీడాకారులను వెలికి తీయడానికి ఇవి ఉపయోగపడాలి: సీఎం
– పోటీలకు వచ్చే క్రీడాకారులకు మంచి భోజనం సహా ఇతర సదుపాయాలు అందేలా చూడాలి:
– పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలి:
– రాష్ట్రానికి చెంది ప్రముఖ క్రీడాకారులు అంతా ఈ పోటీల్లో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి : అధికారులకు సీఎం ఆదేశం.

– రాష్ట్రంలో క్రికెట్‌ సహా ఇతర క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి :
– విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్‌ స్టేడియం దిశగా అడగులు వేయాలి :
– ఇది సాకారం అయ్యాక ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న వైయస్సార్‌ స్టేడియంను.. క్రీడలకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేదిశగా ముందడుగులు వేయాలన్న సీఎం.
– ఈ ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలని సీఎం ఆదేశాలు. 
– రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ముందుకు వచ్చిందని.. కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్‌ అకాడమీల ఏర్పాటు దిశగా ముందుకు సాగాలన్న సీఎం.

ఈ సమీక్ష సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, క్రీడలు, యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ జి వాణీమోహన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, శాప్‌ వీసీ అండ్‌ ఎండీ కె హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Back to Top