విత్తనం నుంచి విక్రయం వరకు రైతు అండగా నిలవాలి

వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ సమాచారం రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) తగినంత ఫర్టిలైజర్‌ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆర్బీకే ఛానల్‌లో స్పెషలిస్ట్‌ సైంటిస్ట్‌ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. స్మార్ట్‌ ఫోన్లలో ఆర్బీకే ఛానల్‌ యాప్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ–క్రాప్ట్‌ జరిగితే కల్తీకి అవకాశం ఉండదని చెప్పారు. ఎప్పటికప్పుడు అగ్రి అడ్వయిజరీ బోర్డు సలహాలు తీసుకోవాలన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ఆర్బీకేలు, అగ్రిల్యాబ్స్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  
 
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఏపీ స్టేట్‌ ఆగ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, జెడ్‌బీఎన్‌ఎఫ్‌ స్పెషల్‌ సీఎస్‌ టి.విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పి.ఎస్‌.ప్రద్యుమ్న, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, ఏపీఎస్‌ఎస్‌డీసీఎల్‌ వీసీ మరియు ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top