అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: అగ్రికల్చర్‌ మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్, ఎంవీఎస్‌ నాగిరెడ్డి, పాలగుమ్మి సాయినాథ్, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై చర్చించారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
 

Back to Top