తాడేపల్లి: కోవిడ్ ప్రోటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించేలా చూడాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే..: 45 ఏళ్లకు పైబడ్డవారు, గర్భిణీలు, టీచర్లకు వ్యాక్సినేషన్‌లో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆగస్టు 16న స్కూల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్ నిబంధనలు పాటించాలి: కరోనా నేపథ్యంలో ఎక్కడా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడకుండా చూడాలని, పెళ్లిళ్ల సీజన్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఒక చోటకు వచ్చే అవకాశాలున్నాయని, కోవిడ్ వ్యాప్తికి దారితీసే అవకాశాలున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. పెళ్లిళ్ల సహా శుభకార్యాల్లో వీలైనంత తక్కువమంది ఉండేలా చూడాలన్నారు. కోవిడ్ నివారణా చర్యలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. పెళ్లిళ్లల్లో 150 మందికే పరిమితం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు ఊరేగింపులు, మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఎక్కువ గుమిగూడకుండా చూడాలని సూచించారు. మాస్కులు వేసుకునేలా, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులు దీనిపై మార్గదర్శకాలు జారీచేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగేంతవరకూ జాగ్రత్తలు తప్పనిసరి : సీఎం వచ్చే రెండు నెలలపాటు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు మాత్రమే చేయాలన్న సీఎం. దీనివల్ల పరీక్షల్లో కచ్చితమైన నిర్ధారణలు వస్తాయని చెప్పారు. ఇంటింటికీ సర్వే కొనసాగాలని, లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని సూచించారు. 104 నంబర్ యంత్రాంగం సమర్థవంతగా సేవలందించేలా నిరంతరం తగిన పర్యవేక్షణ, సమీక్ష చేయాలన్న సీఎం. విలేజ్ క్లినిక్స్ నిర్వహణపై వివరాలు అందించిన అధికారులు బీఎస్సీ నర్సింగ్, సీపీసీహెచ్ కోర్సు చేసిన ఎంఎల్‌హెచ్‌పీని విలేజ్‌క్లినిక్స్‌లో పెడతామన్న అధికారులు వీరితోపాటు ఏఎన్‌ఎం ఒకరిని విలేజ్‌క్లినిక్స్‌లో ఉంచుతామన్న అధికారులు ఆశావర్కర్లు కూడా అక్కడే రిపోర్టు చేయాలని సీఎం ఆదేశాలు విలేజీ క్లినిక్స్‌లో 12 రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు 14 రకాల టెస్టులు 65 రకాల మందులను అందుబాటులో ఉంచుతున్నామన్న అధికారులు దీంతోపాటు టెలీమెడిసిన్ సేవలు కూడా అందుతాయన్న అధికారులు అవుట్‌పేషెంట్ ఎగ్జామినేషన్ రూం, లేబొరేటరీ, ఫార్మసీ, వెయిటింగ్ హాల్, ఏఎన్‌ఎం క్వార్టర్స్‌కూడా అక్కడే ఉంచుతున్నామన్న అధికారులు దీనివల్ల 24 గంటలపాటు ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారన్న అధికారులు 67 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్‌మెంట్ కూడా అందుబాటులో ఉంటాయన్న అధికారులు ప్రజారోగ్యంపై మ్యాపింగ్ విలేజ్‌క్లినిక్స్‌ను పీహెచ్‌సీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనుసంధానం చేయాలి అధికారులకు సీఎం ఆదేశం. ల్యాబులతో కూడా అనుసంధానం చేయాలన్న సీఎం ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందన్న సీఎం గ్రామంలో ప్రజల ఆరోగ్య వివరాలపై మ్యాపింగ్ జరగాలి: సీఎం డిసెంబరు నాటికి విలేజ్ క్లినిక్‌లు పూర్తి ఆరోగ్య శ్రీ కార్డుల ద్వారా సంబంధిత వ్యక్తి వివరాలన్నీ కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో ఉండాలన్న సీఎం వైయస్ జగన్. ఆరోగ్య శ్రీ కార్డు క్యూ ఆర్‌కోడ్ ద్వారా ఈ వివరాలన్నీ కూడా వెంటనే తెలిసేలా చూడాలన్న సీఎం ఇదివరకే సేకరించిన డేటా వివరాలన్నింటినీ కూడా ఆరోగ్యశ్రీ కార్డుతో అనుసంధానం చేయాలి: సీఎం నిర్దేశిత సమయంలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలన్న సీఎం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లో భాగంగా వైద్యుడు ఆ గ్రామానికి వెళ్తున్నప్పుడు చికిత్సకు ఈ వివరాలు ఎంతో సహాయపడతాయి : సీఎం సత్వరమే నిర్ధారణలతో కూడిన వైద్యం అదించడానికి దోహదపడుతుందన్న సీఎం డిసెంబర్‌నాటికి విలేజ్‌క్లినిక్స్ అన్నింటినీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం ఆస్పత్రుల్లో నాడు – నేడుకు సంబంధించి పనులపైనా సీఎం సమీక్ష నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశం కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్ కాలేజీల్లో పనుల ప్రగతిని సీఎంకు వివరించిన అధికారులు పాడేరు, విజయనగరం, పిడుగురాళ్ల, మచిలీపట్నం కాలేజీల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపిన అధికారులు. అనకాపల్లి, నంద్యాలలో మెడికల్‌కాలేజీ స్థలాలపై హైకోర్టులో పిల్స్ దాఖలు అయ్యాయని తెలిపిన అధికారులు. వెంటనే పరిష్కారం దిశగా ప్రయత్నించాలని అధికారులకు సీఎం సూచన అమలాపురం, రాజమండ్రి, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుగొండల్లో పనులు మొదలుపెట్టడానికి కాంట్రాక్టు సంస్థ సన్నాహాలు చేస్తోందని తెలిపిన అధికారులు కర్నూలు జిల్లా ఆదోనిలో కూడా కాంట్రాక్ట్‌సంస్థకు పనులు అవార్డ్ చేశామని, వెంటనే పనులు కూడా మొదలవుతాయని తెలిపిన అధికారులు ప్రస్తుతం ఉన్న మెడికల్‌కాలేజీల్లో కూడా నాడు –నేడు పనులకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు వైద్యారోగ్య రంగంలో నాడు – నేడు పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం అన్ని వివరాలతో సమగ్రంగా ఒక కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు రావాలన్న సీఎం ఒక మంచి ఉద్దేశంతో 16 మెడికల్‌కాలేజీల నిర్మాణాలను చేపట్టాం: సీఎం కార్పొరేట్ తరహా వాతావరణం అక్కడ కనిపించాలి: ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులకు పోతే ఎలాంటి భావన ఉంటుందో... ప్రభుత్వ ఆస్పత్రులలో కూడా ప్రజలకు అదే రకమైన భావన కలగాలి: ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ల ఆప్షన్ మనం కడతున్న ప్రభుత్వ ఆస్పత్రులే అయ్యిండాలి : అ తరహా నాణ్యతతో కూడిన నిర్వహణ ఉండాలి : మెడికల్ కాలేజీల్లో సరైన యాజమాన్య విధానాలపై ఎస్‌ఓపీలను రూపొందించాలి : ఈ తరాలకే కాదు, భవిష్యత్తు తరాలవారికీ కూడా అత్యుత్తమ వైద్యం ప్రజలకు అందాలన్నదే మా కల: ఎల్లప్పుడూ కూడా ఈ మెడికల్ కాలేజీ ఆస్పత్రులు కొత్తగా కనిపించాలి: అత్యంత నాణ్యమైన, సమర్థవంతమైన సేవలు అందాలి: కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా వీటిని నిర్వహించాలి: అందుకు తగ్గ ఎస్‌ఓపీలను తయారు చేయండి: నిర్వహణా పరంగా ఎలా ఉండాలి, నిర్మాణం పూర్తైన తర్వాత ఎలా ఉండాలి అన్నది స్పష్టంగా ఉండాలి : బెడ్ షీట్స్ దగ్గర నుంచి సేవల పరంగా ప్రతి అంశాన్ని ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా నిర్వహణ ఉండాలి : సీఎం ఎలా నిర్వహిస్తామో ఆ పద్ధతులను తయారు చేసి నివేదిక అందించండి : అధికారులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశం ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, స్టేట్ కోవిడ్ కమాండ్ అండ్ కంట్రోల్ ఛైర్‌పర్సన్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, 104 కాల్ సెంటర్ ఇంచార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.