వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలి

కార్మిక శాఖపై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌
 

 

తాడేపల్లి: వ్యవస్థల్లో ఉన్న అవినీతిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కార్మిక శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కార్మిక సంక్షేమం, వైద్య సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి టీచింగ్‌ ఆస్పత్రి తీసుకొస్తున్నామని చెప్పారు. టీచింగ్‌ ఆస్పత్రుల సంఖ్య 11 నుంచి 27కు పెంచుతున్నామని వివరించారు. కార్మిక శాఖలో పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బీమా రూపంలో ఎల్‌ఐసీ బకాయి పడ్డ చెల్లింపుల కోసం ప్రధాని మోదీకి లేఖ రాస్తామని అధికారులకు వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top