విద్యుత్‌ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలి

విద్యుత్‌ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష
 

తాడేపల్లి: విద్యుత్‌ రంగంలో అవినీతికి చోటు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితులపై సీఎంకు అధికారులు వివరాలు అందించారు.  ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలు తెలిపారు. రుణభారం, బకాయిలతో నిండిన డిస్కంలను గట్టెక్కించే మార్గాలపై సీఎం చర్చించారు. 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. కాలక్రమంలో ప్లాంట్‌ను విస్తరించడానికి ప్రణాళిక రూపొందించాలని సూచించారు. జెన్‌కో థర్మల్‌ కేంద్రాలకు నాణ్యమైన బొగ్గు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రో రివర్స్‌ పంపింగ్‌ ప్రాజెక్టులపైనా దృష్టి పెట్టాలి. విద్యుత్‌ అమ్మకాల కోసం ఇన్వేస్టర్ల కోసం ఎక్స్‌పోర్ట్‌ పాలసీ రూపొందించాలని ఆదేశించారు. కృష్ణపట్నం, వీటీపీఎస్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
 

Back to Top