సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుపై సీఎం స‌మీక్ష‌

తాడేప‌ల్లి: ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, సుస్థిర ఆర్థిక అభివృద్ధికోసం చేపడుతున్న పలు పథకాలు, కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జ‌రిగిన ఈ స‌మావేశానికి  సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీష్‌ చంద్ర, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్ వై. శ్రీలక్ష్మి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. ఎస్‌. రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. టీ. కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణద్వివేది,  విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శులు ఎన్‌. గుల్జార్, కె. వి. వి. సత్యనారాయణ, జలవనరులశాఖ కార్యదర్శి జె. శ్యామలరావు, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధరరెడ్డి, ఏపీ టిడ్కో ఎండీ సి.హెచ్‌. శ్రీధర్, ఏఎంఆర్‌డీఏ కమిషనర్ కె. విజయ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

Back to Top