కరోనాపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా పెరిగిపోతోన్న కరోనా కేసులపై ఆయన చర్చిస్తున్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశానికి హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడంతో పాటు కరోనాపై పోరాడుతున్న వైద్యులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్, ఎన్ 95 మాస్కులు అందించడంపై సీఎం కీలక చర్చలు జరుపుతున్నారు.
 ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న లాక్‌‌డౌన్‌పై సీఎం ఆరా తీశారు.  నిత్యావసరాల రవాణా, రైతులను ఆదుకునేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఆయన చర్చిస్తున్నారు. 

Back to Top