దిశ కాల్‌సెంటర్, యాప్‌ ఏర్పాటు చేయండి

దిశ చట్టంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష
 

సచివాలయం: తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టి బాధితులకు న్యాయం కలిగిస్తున్నామన్న విశ్వాసం ప్రజలకు కల్పించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులకు సూచించారు. దిశ చట్టంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. దిశ చట్టం అమలు కోసం ప్రత్యేకంగా ఒక ఐపీఎస్‌ అధికారిని నియమిస్తున్నామన్నారు. దిశ కాల్‌ సెంటర్, దిశ యాప్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే మహిళా సంక్షేమ శాఖ నుంచి ఐఏఎస్‌ అధికారి ఉంటారని,  జిల్లాకు ఒక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో మహిళా పోలీస్‌ స్టేషన్‌ను బలోపేతం చేస్తున్నామని, మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు ఎస్‌ఐలు, అదనపు ఎస్‌ఐ, సిబ్బంది, మహిళాసంక్షేమ అధికారులు కలిసి పనిచేయాలన్నారు. అదే విధంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతున్నామని, విశాఖ, తిరుపతిలో కొత్త ల్యాబ్‌లు నిర్మిస్తున్నామన్నారు. జిల్లాల్లో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు కోసం రూ.26 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 

Back to Top