ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ లేఖ 
 

తాడేపల్లి: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ప్రధానికి లేఖ రాశారు.  అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు సుపరిచితం.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top