చిన్న పరిశ్రమలకు పెద్దసాయం

ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు రీస్టార్ట్‌ ప్యాకేజీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేయూతనందించారు. గత ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు పారిశ్రామిక రాయితీల ద్వారా బకాయిపడ్డ సొమ్మును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. గత నెలలో రూ.450 కోట్లు విడుదల చేసిన సీఎం.. ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత బకాయిలు రూ.512 కోట్లను ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేశారు. అంతకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 
 

Back to Top