కాసేపట్లో రైతు భరోసా రెండో విడత సాయం

ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్న సీఎం వైయస్‌ జగన్‌

ఇటీవల పట్టాలు పొందిన ఎస్టీలకూ రైతుభరోసా సాయం

తాడేపల్లి: రైతు క్షేమమే రాష్ట్ర సంక్షేమంగా భావించి అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అన్నదాత సంక్షేమానికి కట్టుబడి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వరుసగా రెండవ ఏడాది రెండవ విడత ‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పంట పెట్టుబడి సాయాన్ని కాసేపట్లో సీఎం వైయస్‌ జగన్ ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించనున్నారు. రైతు భరోసా సాయం కింద రూ.1,115 కోట్లను నేరుగా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప‌థ‌కం ద్వారా మొత్తం 50.47 లక్షల మంది రైతులకు సాయం అందనుంది. అదే విధంగా ఇటీవల పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. 

Back to Top