అమెరికాలో తెలుగు వారి ఆత్మీయ సమ్మేళనం

నార్త్‌ అమెరికా తెలుగు వాళ్లను కలువనున్న సీఎం వైయస్‌ జగన్‌

డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీలో సందడి వాతావరణం

అమెరికా: అమెరికా పర్యటన లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున(భారత కాలమాన ప్రకారం ఉదయం 4.30 గంటలు) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఇవాళ వాషింగ్టన్‌ డీసీ నుంచి సీఎం వైయస్‌ జగన్‌ డల్లాస్‌ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.11 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30) డల్లాస్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో ప్రముఖులను కలుసుకుంటారు. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఆగస్టు 18 ఉదయం 4:30 గంటలకు) నార్త్‌ అమెరికాలోని తెలుగు వాళ్లను కలుసుకుని.. కే బెయిలీ హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్లో వారినుద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం వైయస్‌ జగన్‌ రాక నేపథ్యంలో డల్లాస్‌లోని తెలుగు కమ్యూనిటీలో సందడి వాతావరణం నెలకొంది. సీఎం జగన్‌ సభ కోసం ప్రవాసాంధ్రులు భారీగా తరలివస్తున్నారు. 
 

Back to Top