ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న‌స్వాగ‌తం

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు పర్యటన నిమిత్తం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి, ఎంపీలు మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్‌. కృష్ణ‌య్య‌, భరత్‌, రెడ్డప్పా, అయోధ్య రామిరెడ్డి, బాలశౌరి, గోరంట్ల మాధవ్‌, రంగయ్యలు ఘన స్వాగతం పలికారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌ బాకాయిలపై చర్చించనున్నారు. అదేవిధంగా రేపు వామపక్ష తీవ్రవాదం నిర్మూలనపై జరుగుతున్న సదస్సులో సీఎం పాల్గొంటారు. శుక్రవారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.

Back to Top