తాడేపల్లి: ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ రూపొందించిన పులుల సంరక్షణ బ్రోచర్‌ను సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పోస్టర్‌ను ఆవిష్కరించి, పులుల సంరక్షణపై తీసుకుంటున్న చర్యలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వన్యప్రాణుల సంరక్షణ అందరూ బాధ్యతగా తీసుకోవాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని సీఎం వైయస్ జగన్ పిలుపునిచ్చారు. ఎస్ఎల్‌బీసీ సమావేశం ప్రారంభం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఎస్ఎల్‌బీసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో సీఎం వైయస్ జగన్, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.