తిరువూరు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌

ఎన్టీఆర్‌ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చేరుకున్నారు. తిరువూరులోని వాహిని ఇంజనీరింగ్‌ కళాశాలకు చేరుకున్న‌ సీఎం వైయస్‌ జగన్‌కు మంత్రులు బొత్స సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణు, మేకా ప్రతాప్ అప్పారావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు. తిరువూరు మార్కెట్‌ యార్డ్‌ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా ప్రాంగణానికి సీఎం బయల్దేరారు. మరికాసేపట్లో జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్‌–డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి సంబంధించిన నగదును సీఎం వైయస్‌ జగన్‌ విడుదల చేయనున్నారు. 

Back to Top