పామర్రు చేరుకున్న సీఎం వైయ‌స్ జగన్‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కృష్ణా జిల్లా పామర్రు చేరుకున్నారు. మ‌రికాసేప‌ట్లో పామర్రు నుంచి జ‌గ‌న‌న్న విద్యా దీవెన - పూర్తి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధుల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి బ‌య‌ల్దేరి పామ‌ర్రుకు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ ముఖ్య‌నేత‌లు హెలిప్యాడ్ వ‌ద్ద ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. హెలిప్యాడ్ నుంచి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ‌గ‌న‌న్న విద్యా దీవెన స‌భా ప్రాంగ‌ణానికి బ‌య‌ల్దేరారు. అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికానికి సంబంధించి 9.44 లక్షల మంది విద్యార్థులకు మంచిచేస్తూ రూ.708.68 కోట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మ‌రికాసేప‌ట్లో విడుదల చేయనున్నారు. పామర్రులో బటన్‌నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్‌ ఖాతాల్లో జ‌గ‌న‌న్న విద్యా దీవెన - పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జమచేయనున్నారు. 

Back to Top