నిడదవోలు చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

ప‌శ్చిమ గోదావ‌రి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొద్ది సేప‌టి క్రిత‌మే నిడ‌ద‌వోలు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇవాళ  ‘వైయ‌స్ఆర్‌ కాపు నేస్తం’ నాలుగో విడతలో భాగంగా బటన్‌ నొక్కి లబ్ధి­దారుల ఖాతాల్లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నగదు జమ చేయనున్నారు.   అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ.536.77 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని విడుదల చేయనున్నారు. ‘ వైయ‌స్ఆర్‌  కాపు నేస్తం’ ద్వారా 45 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్థిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందచేసే సాయంతో కలిపితే ఇప్పటివరకు పథకం ద్వారా మొత్తం రూ.2,029 కోట్లు ఆర్థిక సాయాన్ని అందించినట్లవుతోంది. 

Back to Top